Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డగౌట్‌లోనూ కనిపించని ధోనీ.. ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్!

IPL 2026: ఈ ఐపీఎల్ సీజన్లో ఎంఎస్ ధోనీ ఓ అంతుచిక్కని ప్రశ్నలా మిగిలిపోయాడు. నెట్స్ ప్రాక్టీస్‌లో చురుగ్గా పాల్గొంటునన ధోనీ.. ఇప్పటివరకు సీఎస్కే తరఫున ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే కనీసం డగౌట్లో కూర్చుని తన జట్టును ప్రోత్సహిస్తారని భావించిన అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. ధోనీ కేవలం ప్లేయింగ్ ఎలెవన్‌లోనే కాకుండా స్టేడియంలో కనీసం సైడ్ లైన్ వద్ద కూడా కనిపించడం లేదు. ముంబై ఇండియన్స్‌ జట్టుతో జరగనున్న కీలక పోరుకు ముందు సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ దీనికి గల కారణాలను వెల్లడించారు.

తలా ఈజ్ గ్రేట్ .. కీలక నిర్ణయం
క్రికెట్ ప్రపంచంలో ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి 2020లో రిటైర్ అయినప్పటికీ.. ఇప్పటికీ ఆయనకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఎంఎస్ ధోనీ మైదానంలో ఉంటే కెమెరాల దృష్టంతా ఆయనపైనే ఉంటుంది. ప్రేక్షకులు ఆయన కోసమే కేకలు వేస్తుంటారు. దీని వల్ల స్టేడియంలో ఆడుతున్న జట్టు సభ్యుల నుంచి దృష్టి మళ్లుతుందని ధోనీ భావిస్తున్నారట. జట్టు ప్రదర్శనపైనే అందరి దృష్టి ఉండాలని.. తన వల్ల ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ధోనీ స్వయంగా మ్యాచ్ రోజున స్టేడియానికి రాకూడదని నిర్ణయించుకున్నట్లు మైఖేల్ హస్సీ వెల్లడించారు.

IPL 2026 Why is MS Dhoni Missing from the CSK Dugout Michael Hussey Reveals the Selfless Truth

ధోనీ ఓ టీమ్ మ్యాన్.. మైక్ హస్సీ ప్రశంసలు
"ధోనీ ఎప్పుడూ జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తాడు. తాను స్టేడియానికి వస్తే అనవసరమైన హడావిడి జరుగుతుందని, కెమెరాలు తననే చూపిస్తాయని ఆయన ఆందోళన చెందాడు. జట్టు తన పని తాను ప్రశాంతంగా చేసుకోవాలని ధోనీ కోరుకుంటున్నాడు. అందుకే మ్యాచ్ రోజున దూరంగా ఉంటున్నాడు. ఇది పూర్తిగా ధోనీ సొంత నిర్ణయం, మేనేజ్‌మెంట్ తీసుకున్నది కాదు" అని హస్సీ వివరించారు. ధోనీ మైదానానికి రాకపోయినా.. ఇంట్లోనే ఉండి మ్యాచ్‌లను నిశితంగా గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

డ్రెస్సింగ్ రూమ్‌లో ధోనీ విలువ వెలకట్టలేనిది
ధోనీ నేరుగా మ్యాచ్‌ల్లో పాల్గొనకపోయినా.. ప్రాక్టీస్ సెషన్లలో మాత్రం ఆటగాళ్లతోనే ఉంటున్నాడు. యువ క్రికెటర్లకు తన అనుభవాన్ని పంచుతూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాడు. ధోనీ లాంటి లెజెండ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంటే జట్టుకు వచ్చే బలం వేరని హస్సీ అభిప్రాయపడ్డారు. కాగా, ఈరోజు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ధోనీ ఆడతారా లేదా అనే దానిపై మేనేజ్‌మెంట్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ధోనీ కమ్ బ్యాక్ కోసం కోట్లాది మంది అభిమానులు వేచి చూస్తున్నారు.

Story first published: Saturday, May 2, 2026, 12:09 [IST]
Other articles published on May 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+