SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టులోకి స్టార్ బౌలర్ ఎంట్రీ!
ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ జట్టులో కీలక మార్పు చేసింది. గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్ పేసర్ డేవిడ్ పిన్ స్థానంలో దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్, ముంబై ఇండియన్స్ మాజీ ప్లేయర్ గెరాల్డ్ కోయెట్జీని జట్టులోకి తీసుకుంది. శనివారం సీఎస్కేతో జరగబోయే కీలక మ్యాచ్‌కు ముందు గెరాల్డ్ కోయెట్జీ జట్టుతో చేరడం ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ విభాగానికి కొండంత అండగా మారింది.
డేవిడ్ పిన్‌కు ఏమైంది?
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో మొదట జాక్ ఎడ్వర్డ్స్ స్థానంలో డేవిడ్ పిన్‌ను తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆడిన రెండు మ్యాచ్‌ల్లో రెండు వికెట్లు పడగొట్టిన డేవిడ్ పిన్.. దురదృష్టవశాత్తు చీలమండ గాయానికి గురయ్యాడు. దీంతో డేవిడ్ పిన్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. డేవిడ్ పిన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎంతో అనుభవం ఉన్న గెరాల్డ్ కోయెట్జీని ఎంపిక చేసినట్లు ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.

గెరాల్డ్ కోయెట్జీ అనుభవం, రికార్డులు
గెరాల్డ్ కోయెట్జీకి ఐపీఎల్‌లో ఆడిన మంచి అనుభవం ఉంది. గతంలో గెరాల్డ్ కోయెట్జీ ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు ఆడిన గెరాల్డ్ కోయెట్జీ 15 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ స్థాయిలో దక్షిణాప్రికా తరఫున 4 టెస్టులు, 14 వన్డేలు, 18 టీ20లు ఆడి మొత్తం 67 వికెట్లు సాధించాడు. గంటకు 145 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేయగల సత్తా ఉన్న గెరాల్డ్ కోయెట్జీ రాకతో సన్‌రైజర్స్ పేస్ అటాక్ మరింత బలోపేతం కానుంది.
ధర ఎంతంటే?
ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. గాయపడిన ఆటగాడి స్థానంలో వచ్చే ప్లేయర్‌కు అదే వేతనం లభిస్తుంది. డేవిడ్ పిన్ బేస్ ధర రూ. 2 కోట్లు కాబట్టి, గెరాల్డ్ కోయెట్జీకి కూడా అదే మొత్తం అందనుంది. వరుసగా ఆటగాళ్లు గాయపడుతుండటం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొంత ఆందోళన కలిగించినా.. గెరాల్డ్ కోయెట్జీ లాంటి మ్యాచ్ విన్నర్ జట్టులోకి రావడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మరి ఈ దక్షిణాఫ్రికా పేసర్ ఆరెంజ్ ఆర్మీ తరఫున ఎలాంటి ప్రదర్శన చేస్తాడో వేచి చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications