ఐపీఎల్‌లో దుమ్మురేపినా ఆ లీగ్‌లో అన్‌సోల్డ్?
ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అద్భుతంగా రాణించిన టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ తాజాగా ఓ టీ20 లీగ్ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఐపీఎల్‌లో పరుగుల వరద పారించినప్పటికీ.. ఆ లీగ్‌లో మాత్రం ఆయనను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు. అయితే కేఎల్ రాహుల్ అన్‌సోల్డ్ కావడం వెనుక ఫామ్ సమస్య కాదు.. ఓ బలమైన కారణం ఉంది.
కేఎల్ రాహుల్ అన్‌సోల్డ్ అయింది కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే ప్రతిష్టాత్మక 'మహారాజా టీ20 కప్' టోర్నమెంట్‌లో గమనార్గం. ఈ లీగ్‌కు సంబంధించిన ఆటగాళ్ల వేలంలో కేఎల్ రాహుల్ పేరు రాగా.. ఫ్రాంచైజీలు ఎవరూ బిడ్ దాఖలు చేయలేదు. ఈ టోర్నీలో కేఎల్ రాహుల్ బేస్ ప్రైస్ కేవలం రూ. 2 లక్షలుగానే ఉంది. అంతటి స్టార్ ఆటగాడిని కనీస ధరకు కూడా కొనుగోలు చేయకపోవడానికి ప్రధాన కారణం కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండకపోవడమే.

అంతర్జాతీయ షెడ్యూల్ వల్లే దూరం
కేఎల్ రాహుల్ ప్రస్తుతం జూన్ 6 నుంచి ఆఫ్ఘనిస్తాన్‌తో ప్రారంభం కానున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తోనే జూన్ 12 నుంచి జరిగే వన్డే సిరీస్‌లో కూడా కేఎల్ రాహుల్ పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ అంతర్జాతీయ సిరీస్‌లు ముగిసే సమయానికి మహారాజా టీ20 ట్రోఫీ ప్రారంభమైనప్పటికీ.. ఆ వెంటనే భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. సుదీర్ఘమైన ఇంగ్లాండ్ పర్యటన కోసం కేఎల్ రాహుల్ శారీరకంగా, మానసికంగా సిద్ధం కావాలని భావిస్తున్నాడు. అందుకే ఈ లోకల్ లీగ్‌కు అందుబాటులో ఉండటం కష్టమని భావించి ఫ్రాంచైజీలు కేఎల్ రాహుల్‌ను తీసుకోలేదు.
ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున పరుగుల విధ్వంసం
ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడిన కేఎల్ రాహుల్ కెరీర్ బెస్ట్ ఫామ్‌ను కనబరిచాడు. ఆ సీజన్‌లో ఢిల్లీ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 45కు పైగా సగటుతో 593 పరుగులు సాధించాడు. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్‌పై 152 పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్ ఆడి, ఐపీఎల్ చరిత్రలోనే ఒక మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ సీజన్‌లో 175 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి తన పవర్‌హిట్టింగ్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటాడు. ఐపీఎల్ ముగియడంతో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌లో సత్తా చాటేందుకు రాహుల్ సిద్ధమవుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications