గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు భారీ జరిమానా!
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై థ్రిల్లింగ్ విక్టరీ తర్వాత గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయింటెన్ చేసినందుకు గాను శుభ్‌మన్ గిల్‌కు భారీ జరిమానా విధించారు. వరుస పరాజయాల తర్వాత మొదటి విజయం అందుకున్నామన్న ఆనందంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఇది కొంత చేదు వార్త అనే చెప్పాలి.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ హై-స్కోరింగ్ మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ఆఖర్లో విరుచుకుపడటంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. డేవిడ్ మిల్లర్ ధాటికి బౌలర్లు, కెప్టెన్ వ్యూహాలు మార్చుకోవాల్సి రావడం, ఫీల్డింగ్ సెట్ చేయడంలో జాప్యం జరగడంతో ఇన్నింగ్స్ నిర్ణీత సమయం కంటే ఆలస్యమైంది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. ఇది ఈ సీజన్‌లో గుజరాత్ జట్టు చేసిన మొదటి తప్పిదం కావడంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించినట్లు ఐపీఎల్ కమిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

మ్యాచ్ పరిస్థితి ఇలా..
ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్(70), జోస్ బట్లర్(52), వాషింగ్టన్ సుందర్(55) అద్భుత అర్ధ సెంచరీలతో 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ 92 పరుగులతో అదరగొట్టినప్పటికీ.. మిగిలిన బ్యాటర్ల నుంచి ఆశించిన సహకారం అందలేదు. అయితే చివరి నిమిషంలో డేవిడ్ మిల్లర్ 20 బంతుల్లో 41 పరుగులు చేసి ఢిల్లీని విజయతీరాలకు చేర్చినంత పనిచేశాడు.
చివరి ఓవర్‌లో ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో గుజరాత్ టైటాన్స్ జట్టుకు విజయాన్ని అందించాడు. ఆఖరి 2 బంతుల్లో 2 పరుగులు కావాల్సిన సమయంలో డేవిడ్ మిల్లర్ సింగిల్ తీయడానికి నిరాకరించడం.. చివరి బంతికి కుల్దీప్ యాదవ్ రనౌట్ అవ్వడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసిన రషీద్ ఖాన్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలుచుకున్నారు. పాయింట్ల పట్టికలో ఈ గెలుపుతో గుజరాత్ తన ఖాతా తెరిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications