Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సీఎస్కే మొనగాడికి కాంగ్రెస్ ఎంపీ కవితాభిషేకం!

ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ నుంచి సీఎస్కేకు ట్రేడ్ అయిన సంజూ శాంసన్.. తన బ్యాటింగ్ పవర్‌తో అభిమానులను అలరిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన ఉత్కంఠపోరులో సంజూ శాంసన్ అద్భుత శతకంతో సీఎస్కేను గెలిపించాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌ను చూసి ప్రముఖ రాజకీయవేత్త, కాంగ్రెస్ ఎంపీ కవితా రూపంలో ప్రశంసించగా.. మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా సోషల్ మీడియా వేదికగా తన ప్రేమను కురిపించాడు.

కష్టతరమైన పిచ్‌పై క్లాస్ ఇన్నింగ్స్
ముంబైలోని వాంఖడే స్టేడియంలో బ్యాటింగ్‌కు ఏమాత్రం సహకరించని పిచ్‌పై సంజూ శాంసన్ అసాధారణ బ్యాటింగ్ చేసి సీఎస్కేను విజయతీరాలకు నడిపించాడు. ఇతర బ్యాటర్లు కనీసం 40 పరుగుల మార్కును కూడా దాటలేక ఇబ్బంది పడుతుంటే.. ఓపెనర్‌గా వచ్చిన సంజూ శాంసన్ మాత్రం సీఎస్కే ఇన్నింగ్స్ చివరి బంతి వరకు నిలబడ్డాడు. కేవలం 54 బంతుల్లో 101 పరుగులు సాధించి జట్టుకు భారీ స్కోరును అందించాడు. సంజూ శాంసన్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి.

IPL 2026 Sanju Samson Smashes Century for CSK Shashi Tharoor and Suresh Raina Applaud

పసుపు రంగు నీకు బాగా నప్పింది: సురేష్ రైనా
సీఎస్కే విజయం తర్వాత ఆ జట్టు మాజీ దిగ్గజం సురేష్ రైనా 'ఎక్స్' వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశాడు. "హలో సంజూ శాంసన్.. పసుపు రంగు నీకు చాలా బాగా సెట్ అయింది. ఒక వికెట్ కీపర్ బ్యాటర్ సీఎస్కే జట్టును గెలిపించడం మనం గతంలోనూ చూశాం (ధోనీని ఉద్దేశిస్తూ). అఖీల్ హుస్సేన్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో సీఎస్కే అద్భుత విజయాన్ని అందుకుంది" అంటూ సంజూను సురేష్ రైనా అభినందించాడు.

శశి థరూర్ కవితాభిషేకం
కేరళ ఎంపీ శశి థరూర్ సంజూ శాంసన్‌కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. సంజూ సెంచరీ తర్వాత శశి థరూర్ ఆంగ్లంలో ఓ అద్భుతమైన కవిత రాశారు. "సంజూ బ్యాటింగ్‌లో ఓ ప్రత్యేకమైన నైపుణ్యం ఉంది. సంజూ శాంసన్ మణికట్టు తిప్పే విధానం, టైమింగ్ కళ్లు చెదిరేలా ఉంటాయి. జైపూర్ వెలుగుల నుంచి వాంఖడే ఎండ వరకు.. అతను ఒత్తిడిని జయించి పరుగుల వరద పారించాడు. డర్బన్ నుంచి చెపాక్ వరకు అతనిదే రాజ్యం" అంటూ శశి థరూర్ సంజూ శైలిని ఆకాశానికెత్తారు. గతంలో రాజస్థాన్ రాయల్స్ సారథిగా ఉన్న సంజూ శాంసన్.. ఇప్పుడు చెన్నై జట్టులో కేవలం ఆటగాడిగానే కాకుండా ఓ మ్యాచ్ విన్నర్‌గా తనను తాను నిరూపించుకుంటున్నాడు.

Story first published: Friday, April 24, 2026, 16:16 [IST]
Other articles published on Apr 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+