సీఎస్కే కెప్టెన్‌గా సంజూ శాంసన్!
ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆదివారం(ఏప్రిల్ 26) గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా దూరమయ్యాడు. ఇప్పటికే ఈ సీజన్లో వరుస ఓటములతో సతమతమవుతున్న సీఎస్కేకు.. గుజరాత్ గైక్వాడ్ అందుబాటులో లేకపోవడం కోలుకోలేని దెబ్బగా మారింది. రుతురాజ్ గైక్వాడ్ ఫిట్‌నెస్‌పై ఫ్రాంచైజీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ.. ప్రముఖ కామెంటేటర్ పొమ్మీ మబంగ్వా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
రుతురాజ్ గైక్వాడ్ దూరం కావడంతో సీఎస్కే పగ్గాలను సంజూ శాంసన్ చేపట్టబోతున్నట్లు సమాచారం. ఈ సీజన్ ట్రేడింగ్ విండోలో భాగంగా సంజూ శాంసన్ సీఎస్కేలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ లేని పక్షంలో సంజూ శాంసన్ జట్టును నడిపించడమే కాకుండా.. వికెట్ కీపింగ్ బాధ్యతలను కూడా నిర్వహించనున్నాడు. ఎంఎస్ ధోనీ అందుబాటుపై ఇంకా స్పష్టత లేని నేపథ్యంలో సీఎస్కే యాజమాన్యం జట్టును సంజూ శాంసన్ చేతుల్లో పెట్టినట్లు తెలుస్తోంది. రుతురాజ్ గైక్వాడ్ తిరిగి వచ్చే వరకు సంజూనే కెప్టెన్‌గా కొనసాగే అవకాశం ఉంది.

ఈ పరిణామంపై పొమ్మీ మబంగ్వా స్పందిస్తూ.. "ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. ఇది సీఎస్కేకు కష్టకాలం. రుతురాజ్ తిరిగి వచ్చే వరకు సంజూ శాంసన్ కెప్టెన్సీతో పాటు కీపింగ్ బాధ్యతలు చూసుకుంటాడు. సంజూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు, టీ20 వరల్డ్ కప్ ఫామ్‌ను అతను ఇక్కడ కూడా కొనసాగిస్తున్నాడు" అని ఓ చర్చలో పేర్కొన్నారు.
జట్టులో కీలక మార్పులు చోటుచేసుకోవడంతో సీఎస్కే తన కాంబినేషన్‌ను పూర్తిగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో ఓపెనర్‌గా ఎవరు వస్తారు? ధోనీ చివరి నిమిషంలో జట్టులోకి వస్తాడా? అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. వరుసగా నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో వెనుకబడిన చెన్నై.. కొత్త కెప్టెన్ సంజూ శాంసన్ సారథ్యంలోనైనా గెలుపు బాట పడుతుందో లేదో చూడాలి. ఈ అనూహ్య మార్పు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications