Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాజస్థాన్ రాయల్స్ బౌలర్‌ అత్యుత్సాహం.. భారీ జరిమానా!

ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా అద్భుతమైన ఫామ్‍లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఓ బిగ్ షాక్ తగిలింది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ.. క్రమశిక్షణారాహిత్యం కారణంగా ఆ జట్టు స్టార్ పేసర్ నాండ్రే బర్గర్‌పై మ్యాచ్ రెఫరీ చర్యలు తీసుకున్నారు. ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ అతనికి జరిమానా విధించారు.

10 శాతం ఫీజు కోతం.. డీమెరిట్ పాయింట్
లక్నోతో జరిగిన మ్యాచ్‌లో నాండ్రే బర్గర్ రెండు కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో భాగమయ్యాడు. అయితే ఓ వికెట్ తీసిన తర్వాత లక్నో బ్యాటర్ ను ఉద్దేశించి బర్గర్ చేసిన కామెంట్స్.. ప్రదర్శించిన హావభావాలు అభ్యంతరకరంగా ఉన్నాయని మ్యాచ్ రెఫరీ గుర్తించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5(లెవెల్-1) కింద నాండ్రే బర్గర్ నేరానికి పాల్పడినట్లు తేలింది. దీనివల్ల అతని మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించడంతో పాటు అతని ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చారు.

IPL 2026 RR Pacer Nandre Burger Fined for Code of Conduct Breach Against Lucknow Super Giants

లక్నోపై రాజస్థాన్ విక్టరీ
ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. రాజస్థాన్ రాయల్స్ తక్కువ స్కోరు చేసినప్పటికీ బౌలర్లు అద్భుతం చేశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 159 పరుగులకే పరిమితం కాగా.. ఆ తర్వాత లక్నోను 119 పరుగులకే కట్టడి చేసి 40 పరుగుల తేడాతో గెలిచింది. జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లతో చెలరేగగా.. బ్రిజేష్ శర్మ, నాండ్రే బర్గర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

పాయింట్ల పట్టికలో రాజస్థాన్ జోరు
ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌లలో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి రెండో స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టేబుల్ టాపర్‌గా ఉంది. మరోవైపు రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి దారుణంగా ఉంది. 7 మ్యాచ్‌లలో కేవలం 2 విజయాలతో ఆ జట్టు 9వ స్థానానికి పడిపోయింది. ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే లక్నో ఇక్కడి నుంచి ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో, రాజస్థాన్ ఆటగాళ్లు మైదానంలో దూకుడు ప్రదర్శించేటప్పుడు క్రమశిక్షణ పాటించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Story first published: Thursday, April 23, 2026, 10:44 [IST]
Other articles published on Apr 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+