Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రనౌట్ చేస్తావా బ్రో? రోహిత్ ఫేక్ త్రో.. విరాట్ క్రేజీ రియాక్షన్! (వీడియో)

ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన పోరు క్రికెట్ అభిమానులకు కన్నుల పండువగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మపైనే ఉంది. మ్యాచ్ సందర్భంగా వీరిద్దరి మధ్య జరిగిన ఓ సరదా సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోహిత్ శర్మ బంతిని వికెట్లపైకి విసిరినట్లు నటించగా.. విరాట్ కోహ్లీ క్రీజులోకి వెళ్తూ ఫన్నీగా రియాక్ట్ అవ్వడం చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు.

దుమ్మురేపిన ఆర్సీబీ
బ్యాటింగ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ మొదటి వికెట్‌కు ఏకంగా 120 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారీ స్కోరుకు పునాది వేశారు. విరాట్ కోహ్లీ తన ఫామ్‌ను కొనసాగిస్తూ 38 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 50 పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.

IPL 2026 Rohit Sharma Fake Throw and Virat Kohli Reaction Viral MI vs RCB Highlights

మరో రికార్డును ఖాతాలో వేసుకున్న ఆర్సీబీ
ఈ మ్యాచ్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ చరిత్రలో మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీకి ఇది ఆరో అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ సీజన్‌లోనే సీఎస్కేపై 250 పరుగులు చేసిన బెంగళూరు, ఇప్పుడు ముంబైపై 240 పరుగులు సాధించి తన బ్యాటింగ్ పవర్‌ను చాటుకుంది. 2013లో పుణె వారియర్స్‌పై చేసిన 263 పరుగులు ఇప్పటికీ వారి అత్యధిక స్కోరుగా కొనసాగుతోంది.

రోహిత్ శర్మకు గాయం
అయితే ముంబై ఇండియన్స్ అభిమానులకు ఈ మ్యాచ్‌లో ఓ చేదు వార్త ఎదురైంది. ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డాడు. హ్యామ్‌స్ట్రింగ్ సమస్య కారణంగా రోహిత్ మైదానాన్ని వీడాల్సి వచ్చింది. రోహిత్ గాయం తీవ్రత ఎంత ఉందనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇది ముంబై జట్టుకు కొంత ఆందోళన కలిగించే విషయమే అయినప్పటికీ, మైదానంలో కోహ్లీ-రోహిత్ మధ్య కనిపించిన ఆత్మీయత నెటిజన్ల మనసు గెలుచుకుంది.

Story first published: Monday, April 13, 2026, 9:16 [IST]
Other articles published on Apr 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+