Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పంత్ ఎంట్రీతో మారిపోయిన సీన్.. రాణా-రాఠీ పగకు పుల్‌స్టాప్!(వీడియో)

IPL 2026: ఐపీఎల్ అంటే కేవలం ఫోర్లు, సిక్సర్లు మాత్రమే కాదు.. ప్లేయర్ల మధ్య ఉండే అనుబంధాలకు, అప్పుడప్పుడు చోటుచేసుకునే భావోద్వేగాలకు వేదికగా నిలుస్తుంది. గతంలో మనం గంభీర్-విరాట్ కోహ్లీ, పొలార్డ్-స్టార్క్ వంటి దిగ్గజాల మధ్య వాగ్వాదాలను చూశాం. అయితే ఐపీఎల్ 2026 సీజన్ ఓ గొప్ప క్రీడా స్ఫూర్తికి సాక్ష్యంగా నిలిచింది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఓ శాంతి దూతగా మారి.. ఇద్దరు ఆటగాళ్ల మధ్య నెలకొన్న సుదీర్ఘ కాలపు శత్రుత్వాన్ని ఒక్క నిమిషంలో ముగించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఏమిటా పాత గొడవ?
నితీష్ రాణా, దిగ్వేష్ రాఠీల మధ్య వివాదం నిన్న మొన్నటిది కాదు. గతేడాది ఆగస్టులో జరిగిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ సందర్భంగా వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. మైదానంలోనే ఒకరినొకరు దూషించుకోవడమే కాకుండా అది భౌతిక దాడికి దారితీసేంత వరకు వెళ్లింది. ఈ ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన యాజమాన్యం నితీష్ రాణా మ్యాచ్ ఫీజులో 50 శాతం, దిగ్వేష్ రాఠీ ఫీజులో ఏకంగా 80 శాతం కోత విధించింది. అప్పటి నుంచి వీరిద్దరూ కనీసం పరికరించుకోవడానికి కూడా ఇష్టపడేవారు కాదు.

IPL 2026 Rishabh Pant Turns Peacemaker Ends Nitish Rana and Digvesh Rathi Old DPL Feud

రిషబ్ పంత్ చొరవతో కుదిరిన రాజీ
లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరగనున్న కీలకపోరుకు ముందు ప్రాక్టీస్ సెషన్లో ఓ అద్భుత దృశ్యం కనిపించింది. లక్నో స్పిన్నర్ దిగ్వేష్ రాఠీ పక్క నుంచి వెళ్తుండగా.. రిషబ్ పంత్ జోక్యం చేసుకున్నాడు. "నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆ గొడవ ఎప్పుడో అయిపోయింది కదా.. గతాన్ని వదిలేయ్" అని దిగ్వేష్ రాఠీని పిలిచి నితీష్ రాణా వద్దకు తీసుకెళ్లాడు. రిషబ్ పంత్ చొరవతో నితీష్ రాణా కూడా స్పందిస్తూ సరదాగా.."అయితే ఇక నుంచి నేను నీ పక్కనే కూర్చోవాలి" అని అనడంతో అక్కడ వాతావరణం మొత్తం తేలికపడింది.

సెటైర్లు వేసిన కుల్దీప్ యాదవ్.. వీడియో వైరల్
ఈ స్నేహపూర్వక చర్చలో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా చేరి తనదైన శైలిలో వినోదాన్ని పంచాడు. రిషబ్ పంత్ చేస్తున్న హితబోధను చూసి "చాలా జ్ఞానోదయం కలిగించావు" అంటూ పంత్‌ను ఆటపట్టించాడు. ఇద్దరు ఆటగాళ్లు షేక్‌హ్యాండ్ చేసుకుని గతాన్ని మర్చిపోతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి. మైదానంలో ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ.. బయట స్నేహంగా ఉండాలనే ఐపీఎల్ అసలు స్ఫూర్తిని రిషబ్ పంత్ మరోసారి నిరూపించాడు.

Story first published: Wednesday, April 1, 2026, 14:09 [IST]
Other articles published on Apr 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+