Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మళ్లీ అవే తప్పిదాలు.. పంజాబ్ విక్టరీపై పాంటింగ్ అసంతృప్తి!

ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టు అద్భుత విజయాన్ని అందుకున్నప్పటికీ.. ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మాత్రం జట్టు ప్రదర్శనపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం రికీ పాంటింగ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జట్టు సాధించిన విజయాన్ని అభినందిస్తూనే స్టేడియంలో ఆటగాళ్లు చేసిన తప్పులను వేలెత్తి చూపించాడు. ముఖ్యంగా ఫీల్డింగ్ లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రికీ పాంటింగ్ స్పష్టం చేశాడు.

ఫీల్డింగ్‌పై పాంటింగ్ అసంతృప్తి
మ్యాచ్ విజయం అనంతరం రికీ పాంటింగ్ జట్టు ఫీల్డింగ్ లోపాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. "మేము ఈ విజయాన్ని చాలా కష్టపడి సాధించాల్సి వచ్చింది. స్టేడియంలో మేము మళ్లీ పాత అలసత్వాన్ని ప్రదర్శించాం. ఫీల్డింగ్‌లో చేసిన తప్పుల కారణంగా ప్రత్యర్థి జట్టుకు వారు చేయాల్సిన స్కోరు కంటే ఒక 20 పరుగులు ఎక్కువే సమర్పించుకున్నాం. లీగ్‌లో ముందుకు వెళ్లాలంటే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లను వెంటనే సరిదిద్దుకోవాలి" అని రికీ పాంటింగ్ హెచ్చరించాడు.

IPL 2026 Ricky Ponting Unhappy with PBKS Fielding Despite Shreyas Iyer Maiden Century Details

కెప్టెన్‌పై ప్రశంసల వర్షం
బౌలింగ్, ఫీల్డింగ్‌లో తప్పులు దొర్లినా.. లక్ష్యఛేదన మాత్రం చాలా అద్భుతంగా సాగిందని రికీ పాంటింగ్ కొనియాడాడు. ముఖ్యంగా జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆడిన బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ను రికీ పాంటింగ్ ప్రత్యేకంగా అభినందించాడు. "మా కెప్టెన్ ఇదివరకు కూడా చాలాసార్లు జట్టును గెలిపించే ఇన్నింగ్స్‌లు ఆడాడు. కానీ శ్రేయస్ అయ్యర్‌కు ఇది మొదటి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. ఈ రాత్రి మేము దీనిని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాం. అతను ఒక అద్భుతమైన వ్యక్తి మాత్రమే కాదు, ఎంతో పరిణతి చెందిన ఆటగాడు, నాయకుడు. మైదానంలో తన భావోద్వేగాలను ఎప్పుడూ అదుపులో ఉంచుకుంటాడు. జట్టులో అతనికి దక్కే గౌరవం అసాధారణమైనది. అతనితో కలిసి పని చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది" అని కెప్టెన్ నాయకత్వ నైపుణ్యాలను రికీ పాంటింగ్ ఆకాశానికెత్తాడు.

పరిణతితో ఆడిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్
కెప్టెన్‌తో పాటు యువ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ప్రదర్శనను కూడా హెడ్ కోచ్ అభినందించారు. టాప్ ఆర్డర్‌లో ప్రభ్‌సిమ్రాన్ జట్టుకు మంచి పునాది వేస్తున్నాడని పాంటింగ్ పేర్కొన్నాడు. "ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కూడా ఓ అద్భుతమైన ఆటగాడు. తను టాపార్డర్‌లో ఎంత బాగా ఆడగలడో గత రెండేళ్లలోనే అతను గ్రహించి, తనను తాను నిరూపించుకున్నాడు. ఈ రాత్రి ఒక పెద్ద రన్ చేజ్‌లో అతను చాలా పరిణతితో కూడిన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయానికి సహకరించాడు" అని ప్రశంసించాడు.

జట్టు రూమ్‌లో తదుపరి మ్యాచ్ ఎంజాయ్ చేస్తాం..
జట్టులో ప్రస్తుతం చాలా సానుకూల వాతావరణం ఉందని రికీ పాంటింగ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. "ప్రస్తుతం మాకు ఒక మంచి టీమ్ రూమ్ వాతావరణం ఉంది. ఆటగాళ్లంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మేమంతా కలిసి కూర్చుని ఈరోజు జరగబోయే తదుపరి రసవత్తర మ్యాచ్ (ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్) ను వీక్షిస్తూ, ఈ విజయానందాన్ని ఎంజాయ్ చేస్తాం" అని రికీ పాంటింగ్ ముగించాడు.

Story first published: Sunday, May 24, 2026, 10:41 [IST]
Other articles published on May 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+