For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫలించిన రికీ పాంటింగ్ వ్యూహం.. దెబ్బకు పంజాబ్ పంట పండింది!

ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే పంజాబ్ కింగ్స్ జట్టు ఓ కొత్త సంచలనానికి తెరలేపింది. గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఆస్ట్రేలియా యువ ప్లేయర్ కూపర్ కాన్లీ 44 బంతుల్లో 72 రన్స్ చేసి పంజాబ్ కింగ్స్ జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. అయితే ఈ ఉత్కంఠభరిత విజయం వెనుక పంజాబ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తీసుకున్న ఓ సాహసోపేత నిర్ణయం ఉంది. ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్ కూపర్ కాన్లీని టాపార్డర్‌లో ఆడించాలన్న రికీ పాంటింగ్ నిర్ణయం పంజాబ్ కింగ్స్ జట్టుకు కాసుల పంట పండించింది. అరంగేట్ర మ్యాచ్‌లోనే మ్యాచ్ విన్నర్‌గా నిలిచి కూపర్ కాన్లీ అందరినీ ఆశ్చర్యపరిచాడు.

రికీ పాంటింగ్ మాస్టర్ ప్లాన్!
సాధారణంగా కూపర్ కాన్లీ ఆస్ట్రేలియా జాతీయ జట్టు తరఫున టీ20ల్లో 7 లేదా 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తుంటాడు. లోయర్ ఆర్డర్ లో వచ్చి మెరుపులు మెరిపించడం, లెఫ్టార్మ్ స్పిన్ వేయడం కూపర్ కాన్లీ ప్రధాన బాధ్యత. కానీ గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ రికీ పాంటింగ్ కాన్లీని మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాడు. ఆస్ట్రేలియాలో ఫినిషర్‌గా ముద్రపడిన ఆటగాడిని టాపార్డర్‌లో ఆడించాలన్న రికీ పాంటింగ్ వ్యూహం పక్కాగా పనిచేసింది. 163 పరుగుల లక్ష్య ఛేదనలో కూపర్ కాన్లీ క్లాస్ ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను గెలిపించాడు.

IPL 2026 Ricky Ponting Masterstroke How Promoting Cooper Connolly Won It for Punjab Kings

రికీ పాంటింగ్ వ్యూహం వెనుక కారణం ఇదే..!
ఐపీఎల్ వేలంలో రూ.3 కోట్లకు కూపర్ కాన్లీని కొనుగోలు చేసినప్పుడే రికీ పాంటింగ్‌కు అతడిపై ఓ స్పష్టమైన అంచనా ఉంది. ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే కోచ్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. "కూపర్ కాన్లీ జట్టులోకి రావడం వల్ల మా బ్యాటింగ్ ఆర్డర్‌లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. కాన్లీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కావడం వల్ల లెఫ్ట్-రైట్ కాంబినేషన్‌కు అది బాగా ఉపయోగపడుతుంది. అందుకే అతడిని టాప్ లేదా మిడిల్ ఆర్డర్‌లో ఎక్కడైనా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాం." అని రికీ పాంటింగ్ అన్నాడు.

సంతోషంగా ఉంది: కూపర్ కాన్లీ
మ్యాచ్ అనంతరం కూపర్ కాన్లీ తన ఆనందాన్ని పంచుకుంటూ.. "ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో కలిసి ఆడటం కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాను. ఈ రోజు నా ప్రదర్శనతో జట్టును గెలిపించడం చాలా సంతోషంగా ఉంది. నేను మరీ భారీ సిక్సర్లు కొట్టే రకం కాదు.. కేవలం టైమింగ్‌తో ఆడటానికే ఇష్టపడతాను" అని కూపర్ కాన్లీ వెల్లడించాడు. గతేడాది తృటిలో ఐపీఎల్ టైటిల్‌ను కోల్పోయిన పంజాబ్ కింగ్స్ జట్టు.. ఈ సారి కూపర్ కాన్లీ వంటి కొత్త స్టార్ల రాకతో మళ్లీ ఆశలు చిగురింపజేస్తోంది.

Story first published: Wednesday, April 1, 2026, 12:54 [IST]
Other articles published on Apr 1, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+