For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సన్‌రైజర్స్‌ను ముంచేసిన ఆ ఒక్క నిర్ణయం: సీక్రెట్ బయటపెట్టిన ఆర్సీబీ కెప్టెన్

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్‌‌లోనే ఆర్సీబీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన పోరులో ఆర్సీబీ అలవోకగా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రజత్ పటిదార్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన ఆర్సీబీ.. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరిచింది. మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ తన జట్టు విజయంపై, ఆటగాళ్ల పర్ఫార్మెన్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

మ్యాచ్ విక్టరీపై సంతృప్తి
మ్యాచ్ ముగిసిన అనంతరం మాట్లాడిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్.. ఈ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ గెలవడం పట్ల పూర్తి సంతోషాన్ని వ్యక్తం చేశాడు. "ఓ కొత్త సీజన్‌ను విజయంతో ప్రారంభించడం చాలా ముఖ్యం. మా జట్టు ప్రదర్శన పట్ల నేను 100 శాతం సంతృప్తిగా ఉన్నాను. మైదానంలో మా కుర్రాళ్లు ఆడిన తీరు అద్భుతం. ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన బాధ్యతను గుర్తించి, జట్టు కోసం శ్రమించారు. ఈ సమిష్టి కృషి వల్లే సన్‌రైజర్స్‌ వంటి బలమైన జట్టుపై మేము పైచేయి సాధించగలిగాం" అని రజత్ పటిదార్ పేర్కొన్నాడు.

IPL 2026 Rajat Patidar Reveals the Secret Behind RCB Dominant Victory Over SRH in Opener

మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఇదే..
సన్‌రైజర్స్ భారీ స్కోరు చేసేలా కనిపించినప్పటికీ.. కివీస్ పేసర్ జాకబ్ డఫీ స్పెల్ మ్యాచ్ గమనాన్ని మార్చేసిందని పాటిదార్ కొనియాడాడు. "డఫీకి ఇది అరంగేట్ర మ్యాచ్ అయినప్పటికీ, ఎంతో అనుభవం ఉన్న బౌలర్‌లా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలో డఫీ కీలక వికెట్లు తీసి హైదరాబాద్ వేగానికి అడ్డుకట్ట వేశాడు. ఆ 4 ఓవర్ల స్పెల్ మ్యాచ్‌కే టర్నింగ్ పాయింట్. డఫీ సరైన లెంగ్త్‌లో బంతులు వేసి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు" అని జాకబ్ డఫీని ప్రశంసించాడు.

విధ్వంసం సృష్టించిన కోహ్లీ, పడిక్కల్
బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ జోడీ ఆర్సీబీకి బలమైన ఆరంభాన్ని ఇచ్చిందని రజత్ పటిదార్ వివరించాడు. "మేము ముందుగానే వేగంగా ఆడాలని అనుకోలేదు. వికెట్ స్వభావాన్ని బట్టి బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో కోహ్లీ, పడిక్కల్ దానిని చక్కగా ఉపయోగించుకున్నారు. వారిద్దరి ఇన్నింగ్స్ మా విజయానికి గట్టి పునాది వేసింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ గురించి చెప్పడానికి మాటలు లేవు. రన్ ఛేజింగ్‌లో కోహ్లీ ఇప్పటికీ ప్రపంచంలోనే నంబర్ 1 బ్యాటర్. కోహ్లీ క్రీజులో ఉంటే చాలు, జట్టులో గెలుపుపై నమ్మకం రెట్టింపు అవుతుంది" అని కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు.

ఫీల్డింగ్‌లో సాల్ట్ మెరుపులు
ఫీల్డింగ్ గురించి రజత్ పటిదార్ మాట్లాడుతూ.. ఫిల్ సాల్ట్ పట్టిన అద్భుతమైన క్యాచ్ గురించి పాటిదార్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. "ఫిల్ సాల్ట్ పట్టిన ఆ క్యాచ్ చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను. మైదానంలో అంతటి చురుకుదనం చూపించడం సామాన్యం కాదు. సాల్ట్ ఓ గొప్ప ఫీల్డర్ అని ఆ క్యాచ్‌తో మరోసారి నిరూపితమైంది. అటువంటి ఫీల్డింగ్ విన్యాసాలు బౌలర్లలో మరింత ఉత్సాహాన్ని నింపుతాయి" అని రజత్ పటిదార్ పేర్కొన్నాడు.

ఇంపాక్ట్ క్రియేట్ చేయడమే నా లక్ష్యం
చివరగా తన వ్యక్తిగత బ్యాటింగ్ శైలి గురించి రజత్ పటిదార్ వివరిస్తూ.. "నేను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు జట్టు గెలుపు సమీపంలో ఉంది. అయితే కేవలం గెలవడమే కాకుండా ఓ ఇంపాక్ట్ (ప్రభావం) చూపించాలని భావించాను. అందుకే వీలైనంత త్వరగా మ్యాచ్‌ను ముగించాలని దూకుడుగా ఆడాను. ఈ వేగం వల్ల నెట్ రన్ రేట్ కూడా మెరుగుపడుతుంది. జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆడటమే నా ప్రాధాన్యత" అని కెప్టెన్ రజత్ పాటిదార్ ముగించాడు.

Story first published: Sunday, March 29, 2026, 10:31 [IST]
Other articles published on Mar 29, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+