వార్ని.. రాజస్థాన్ టీమ్ మేనేజర్ ఫోన్ వాడకం వెనుక ఇంత కథ ఉందా?
గౌహతి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఘనవిజయం సాధించినప్పటికీ.. మైదానం బయట ఓ వివాదం చెలరేగింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు మేనేజర్ రోమీ భిందర్ డగౌట్లో కూర్చొని మొబైల్ ఫోన్ వాడుతూ కెమెరాలకు చిక్కారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్లో మొబైల్ ఫోన్లు వాడటం నిషేధం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అవినీతి నిరోధక భద్రతా విభాగం(ACSU) దీనిపై సీరియస్ అయ్యింది.
బీసీసీఐ సీరియస్.. 48 గంటల్లో వివరణ
ఈ ఘటనపై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం స్పందిస్తూ రోమీ భిందర్‌కు నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా ఈ ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయని.. దీనిపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఏసీఎస్‌యూని కోరినట్లు ఆయన వెల్లడించారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ క్యాంపులో ఒక్కసారిగా కలకలం మొదలైంది.

వెలుగులోకి ఆరోగ్య సమస్యలు
అయితే రోమీ భిందర్ ఫోన్ వాడటం వెనుక బలమైన ఆరోగ్య కారణం ఉందని సమాచారం. గతంలో ఆయనకు రెండు ఊపిరితిత్తులు పాడై దాదాపు ఒక వారం పాటు వెంటిలేటర్‌పై ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు నెల రోజుల పాటు నాగ్‌పూర్‌లోని ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందారు. ఈ ప్రాణాంతక పరిస్థితి నుంచి కోలుకుంటున్న క్రమంలో భద్రతా కారణాల దృష్ట్యా ఆయన ఎప్పుడూ ఫోన్ దగ్గరే ఉంచుకోవాల్సి వస్తోందని టీమ్ వర్గాలు చెబుతున్నాయి.
మెడికల్ ఎమర్జెన్సీయే కారణమా?:
రోమీ భిందర్ ప్రస్తుతం ఆస్తమాతో బాధపడుతున్నారని.. అనారోగ్యం కారణంగా సుమారు 10 కిలోల బరువు తగ్గారని సమాచారం. నిబంధనల ప్రకారం ఫోన్ డ్రెస్సింగ్ రూమ్‌లోనే వాడాలి. కానీ డగౌట్ నుంచి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాలంటే సుమారు 50 అడుగులు నడవడంతో పాటు 20 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఊపిరితిత్తుల సమస్య ఉన్న ఆయనకు ఇది చాలా కష్టమైన పని కావడంతోనే ఆయన డగౌట్లో ఫోన్ చూడాల్సి వచ్చిందని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఆయన ఎవరికీ కాల్స్ చేయలేదని, కేవలం స్క్రోల్ మాత్రమే చేశారని, మానవీయ కోణంలో ఏసీఎస్‌యూ దీనిని పరిశీలించాలని వారు కోరుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications