Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs GT: క్వాలిఫైయర్ మ్యాచ్‌ రద్ధు?

RCB vs GT: ఐపీఎల్ 2026 సీజన్ మొదటి క్వాలిఫైయర్ పోరుకు సమయం ఆసన్నమైంది. నేడు(మంగళవారం) ధర్మశాల స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లే అవకాశం ఉండటంతో ఇరు జట్లు తమ సర్వశక్తులూ ఒడ్డడానికి సిద్ధమయ్యాయి. అయితే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌పై ప్రస్తుతం వర్షం నీలి నీడలు కమ్ముకున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి.

వాతావరణ నివేదికల ప్రకారం.. ఈ రోజు ధర్మశాలలో వర్షం కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పగటిపూట భారీ వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు మ్యాచ్ జరిగే సాయంత్రం వేళల్లో కూడా వర్షం పడి అభిమానులను నిరాశకు గురిచేసే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే మ్యాచ్ పూర్తిగా రద్దయ్యేంత ప్రభావం ఉండకపోవచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. టాస్ పడే సమయానికి వర్షం పడటం వల్ల మ్యాచ్ ప్రారంభం కావడంలో కాస్త ఆలస్యం జరగొచ్చు కానీ, రాత్రి వేళల్లో వర్షం కురిసే అవకాశం తక్కువగానే ఉందని తెలుస్తోంది.

IPL 2026 Qualifier 1 Will RCB vs GT Match in Dharamshala Be Washed Out Due to Rain Full Details

వాతావరణ శాఖ అంచనా నిజమైతే.. రాత్రి 7:30 గంటల తర్వాత వర్షం పడే అవకాశాలు లేవు. కాబట్టి క్రికెట్ అభిమానులకు పూర్తి 40 ఓవర్ల ఆటను చూసే భాగ్యం దక్కవచ్చు. అయితే కొండ ప్రాంతమైన ధర్మశాలలో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే వాతావరణం అనుకూలించి మ్యాచ్ సజావుగా సాగాలని ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు. ఒకవేళ సాయంత్రం పడే వర్షం కారణంగా పిచ్‌ను ఎక్కువ సమయం కవర్లతో కప్పి ఉంచాల్సి వస్తే.. అది ఇరు జట్ల వ్యూహాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసే జట్టుకు ఇబ్బందులు ఎదురుకావచ్చు, ఎందుకంటే ప్రారంభంలో బంతి తక్కువ బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఇది బౌలర్లకు బాగా కలిసిరానుంది.

ఇక ఇరు జట్ల రికార్డులను పరిశీలిస్తే.. ఐపీఎల్ 2026 లీగ్ దశలో ఈ రెండు జట్లు చివరిసారి తలపడినప్పుడు గుజరాత్ టైటాన్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆర్సీబీని ఓడించింది. ఆ మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి ప్రతికారం తీర్చుకోవాలని బెంగళూరు జట్టు పట్టుదలగా ఉంది. మరి ఈ రసవత్తర పోరులో గుజరాత్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటుందో, లేక ఆర్సీబీ పుంజుకుని ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటుందో చూడాలి.

Story first published: Tuesday, May 26, 2026, 14:03 [IST]
Other articles published on May 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+