Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రిన్స్ యాదవ్ vs ట్రిస్టన్ స్టబ్స్.. డిష్యూం.. డిష్యూం! (వీడియో)

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. స్టేడియంలో ఆటగాళ్ల మధ్య పోటీ తత్వాన్ని మించి అప్పుడప్పుడు భావోద్వేగాలు కట్టులు తెంచుకోవడం సాధారణమే. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఇందుకు వేదికైంది. ముఖ్యంగా లక్నో యువ పేసర్ ప్రిన్స్ యాదవ్, ఢిల్లీ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ మధ్య జరిగిన వాగ్వాదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరిద్దరి మధ్య జరిగిన హైవోల్టేజ్ డ్రామా అభిమానులను ఉర్రూతలూగించింది.

స్టేడియంలో అసలేం జరిగింది?
ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్య ఛేదనలో ఉన్న సమయంలో ఇన్నింగ్స్ 5వ ఓవర్లో అసలు కథ మొదలైంది. ఆ ఓవర్ నాలుగో బంతికి ట్రిస్టన్ స్టబ్స్ అద్భుతమైన పుల్ షాట్‌తో ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ఫోర్ బాదాడు. ఆ షాట్‌తో యువ బౌలర్‌ ప్రిన్స్ యాదవ్ కాస్త అసహనానికి గురయ్యాడుయ ఆ మరుసటి బంతిని ప్రిన్స్ యాదవ్ లెంగ్త్ బాల్ సంధించగా.. ట్రిస్టన్ స్టబ్స్ దానిని డిఫెండ్ చేశాడు. అయితే బంతి వేసిన వెంటనే ప్రిన్స్ ఆవేశంతో స్టబ్స్ వైపు వెళ్తూ.. అతడిని సీరియస్‌గా చూశాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు స్టబ్స్ కూడా ఏమాత్రం బెదరకుండా ప్రిన్స్ యాదవ్ కళ్లలోకి చూస్తూ ధీటుగా సమాధానమిచ్చాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదిరేలా కనిపించినా..గొడవ పెద్దది కాకుండానే ముగిసింది. అంపైర్లు జోక్యం చేసుకోకముందే ఇద్దరూ వెనక్కి తగ్గడంతో పెను ప్రమాదం తప్పింది.

IPL 2026 Prince Yadav vs Tristan Stubbs Heated Face-off Rishabh Pant Opening Experiment Fails

ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ మెరుపులు
స్టబ్స్‌తో గొడవ జరిగినప్పటికీ.. ఆ ఓవర్లో ప్రిన్స్ యాదవ్ తన ఏకాగ్రతను కోల్పోలేదు. ఆ ఓవర్లో చివరి బంతిని వేయగా.. స్టబ్స్ డిఫెండ్ చేసుకోవాల్సి వచ్చింది. నిజానికి ఆ ఓవర్లో ప్రిన్స్ యాదవ్ అద్భుతమైన స్పెల్ వేశాడు. ట్రిస్టన్ స్టబ్స్‌తో వాగ్వాదానికి ముందే అదే ఓవర్ రెండో బంతికి ప్రమాదకరమైన పాతుమ్ నిస్సంకను కీపర్ రిషబ్ పంత్ చేతికి చిక్కేలా చేసి ఔట్ చేశాడు. ఆ వెంటనే మూడో బంతికి ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్‌ను క్లీన్ బౌల్డ్ చేసి గోల్డెన్ డక్‌గా పంపాడు. ఒకే ఓవర్లో ఇద్దరు కీలక బ్యాటర్లను పెవిలియన్ చేర్చి ఢిల్లీని ఒక్కసారిగా ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ సీజన్లో ప్రిన్స్ యాదవ్ తన వేగంతో ఓ సెన్సేషన్‌గా మారుతున్నాడని ఈ ప్రదర్శన నిరూపించింది.

రిషబ్ పంత్ ఓపెనింగ్ ప్రయోగం విఫలం
ఈ మ్యాచ్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన మరో అంశం రిషబ్ పంత్ బ్యాటింగ్ ఆర్డర్. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి అందరికీ షాక్ ఇచ్చాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో ఇది కేవలం ఆరోసారి మాత్రమే కావడం గమనార్హం. అయితే ఈ ప్రయోగం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కేవలం 7 పరుగులు మాత్రమే చేసిన రిషబ్ పంత్.. సమన్వయ లోపం కారణంగా రనౌట్ అయ్యాడు. జట్టు స్కోరును భారీగా పెంచుతాడని భావించిన ఫ్యాన్స్‌కు పంత్ నిరాశనే మిగిల్చాడు. ఈ రనౌట్ మ్యాచ్‌ను మలుపు తిప్పడంలో కీలక పాత్ర పోషించింది.

ఢిల్లీ ఘన విజయం
చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తక్కువ స్కోరునైనా కాపాడుకోవాలని లక్నో బౌలర్లు శ్రమించినా.. ఢిల్లీ బ్యాటర్లు సమర్థవంతంగా లక్ష్యాన్ని ఛేదించారు. ఐపీఎల్ 2026 సీజన్లో ఆటగాళ్ల మధ్య చోటుచేసుకున్న మొదటి వాగ్వాదంగా ఈ మ్యాచ్ రికార్డుల్లో నిలిచిపోయింది. లక్నో పరాజయం పాలైనప్పటికీ.. యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్ చూపించిన దూకుడు, అతిని బౌలింగ్ టాలెంట్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Story first published: Thursday, April 2, 2026, 9:59 [IST]
Other articles published on Apr 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+