IPL 2026: వర్షం పడితే మ్యాచ్ రద్దు.. కానీ ఫైనల్ చేరేది ఆ జట్టే!
IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్ మ్యాచ్‌లు నేటి(మంగళవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 మ్యాచ్‌ల కోసం ఎలాంటి రిజర్వ్ డే కేటాయించలేదు. ఒకవేళ ఈ కీలక మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించి మ్యాచ్ పూర్తిగా రద్దయితే ఏ జట్టును విజేతగా ప్రకటిస్తారనే దానిపై ఐపీఎల్ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. లీగ్ దశ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్లకు ఈ పరిస్థితి కలిసి రానుంది.
నేడు(మంగళవారం) ధర్మశాలలో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగాల్సి ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే ఆర్సీబీ నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఎందుకంటే ఈ సీజన్ లీగ్ దశలో ఆర్సీబీ, గుజరాత్ రెండూ జట్లూ చెరో 9 మ్యాచ్ లు గెలిచినప్పటికీ.. మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. గుజరాత్ రెండో స్థానంలో ఉన్నందున పాయింట్ల పట్టికలో పైన ఉన్న నియమం ప్రకారం ఆర్సీబీని విజేతగా ప్రకటిస్తారు.

ఇక మే 27న చండీగఢ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. లీగ్ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 విజయాలతో మూడో స్థానంలో, రాజస్థాన్ 8 విజయాలతో నాలుగో స్థానంలో నిలిచాయి. ఒకవేళ ఈ ఎలిమినేటర్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయితే పాయింట్ల పట్టికలో పైస్థానంలో ఉన్న ఎస్ఆర్‌హెచ్ జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. రాజస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
మే 29న జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. క్వాలిఫయర్-1లో ఓడిపోయిన జట్టు ఎలిమినేటర్ విజేతతో తలపడే ఈ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే లీగ్ దశలో ఏ జట్టు అయితే పాయింట్ల పట్టికలో పై స్థానంలో ఉంటుందో ఆ జట్టుకే ఫైనల్ టికెట్ దక్కుతుంది. ఈ విధంగా పాయింటల పట్టికలో టాప్ స్థానాల్లో నిలవడం జట్లకు ఎంతటి అదనపు ప్రయోజనాన్ని ఇస్తుందో ఈ నిబంధనల ద్వారా స్పష్టమవుతోంది. మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గ్రాండ్ ఫైనల్ జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications