Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: ఒకే ఒక్క ప్లేఆఫ్ బెర్త్.. అద్భుతం జరిగితేనే ఆ రెండు జట్లకు ఛాన్స్!

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ ముగింపునకు చేరుకోవడంతో ప్లేఆఫ్స్ రేసు కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు అధికారికంగా ప్లేఆఫ్స్ టికెట్లను ఖరారు చేసుకున్నాయి. అయితే మిగిలి ఉన్న ఏకైక నాలుగో స్థానం కోసం ఏకంగా 5 జట్ల మధ్య డూ ఆర్ డై పోరు నడుస్తోంది. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్.. ఈ 5 జట్ల భవితవ్యం ఇప్పుడు ఇతర జట్ల విజయాలు, నెట్ రన్ రేట్ సమీకరణాలపై ఆధారపడి ఉంది.

పంజాబ్, రాజస్థాన్ జట్లకే ఎక్కువ అవకాశం
ప్రస్తుత సమీకరణాల ప్రకారం నాలుగో స్థానానికి రేసులో అందరికంటే మెరుగైన స్థితిలో పంజాబ్ కింగ్స్ జట్టు ఉంది. 13 మ్యాచ్‌లలో 13 పాయింట్లతో పంజాబ్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే పంజాబ్ కింగ్స్ 15 పాయింట్లకు చేరుకుంటుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కథ మరింత ఆసక్తికరంగా ఉంది. రాజస్థాన్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఒకవేళ రాజస్థాన్ తన మిగిలిన రెండు మ్యాచ్‌లలో (లక్నో, ముంబైలపై) విజయం సాధిస్తే.. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లేఆఫ్స్ చేరుకుంటుంది. కానీ ఒక్క మ్యాచ్ ఓడినా వారి అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి.

IPL 2026 Playoffs Race One Spot Left 5 Teams in Action Tough Equations for Delhi Capitals and KKR

సీఎస్కే ఆశలు ఇతరుల చేతుల్లో..!
సోమవారం రాత్రి సన్‌రైజర్స్ చేతిలో ఓడిపోయిన సీఎస్కే పరిస్థితి ఇప్పుడు చాలా పేలవంగా తయారైంది. 13 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో ఉన్న సీఎస్కే.. ప్లేఆఫ్స్ చేరాలంటే తమ చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను భారీ తేడాతో ఓడించాల్సి ఉంటుంది. కేవలం తాము గెలవడమే కాకుండా పంజాబ్ కింగ్స్ తమ చివరి మ్యాచ్‌లో ఓడిపోవాలని.. అలాగే రాజస్థాన్ రాయల్స్ తమ మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఒక దాంట్లోనే గెలవాలని సీఎస్కే ప్రార్థించాల్సి ఉంటుంది. అప్పుడే నెట్ రన్ రేట్ ఆధారంగా సీఎస్కేకు అవకాశం దక్కుతుంది.

అద్భుతం జరిగితేనే ఢిల్లీ, కోల్‌కతా రేసులోకి..
ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల ప్లేఆఫ్స్ ఆశలు కేవలం అద్భుతాలపైనే ఆధారపడి ఉన్నాయి. ఢిల్లీ ప్లేఆఫ్స్ చేరాలంటే.. మొదట పంజాబ్ ఓడిపోవాలి, రాజస్థాన్ తన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవాలి,గుజరాత్ చేతిలో సీఎస్కే ఓడిపోవాలి. ఇవ్వన్నీ జరిగిన తర్వాత ఢిల్లీ తన చివరి మ్యాచ్‌లో కేకేఆర్‌పై భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. ఇక కేకేఆర్ విషయానికి వస్తే.. పంజాబ్ ఓడిపోతేననే వారికి నెట్ రన్ రేట్ పోరు మొదలవుతుంది. అందుకోసం కేకేఆర్ జట్టు ముంబై, ఢిల్లీ రెండింటిపై భారీ విజయాలు సాధించాల్సి ఉంటుంది.

హైదరాబాద్ విజయం.. ప్యాట్ కమిన్స్ ధీమా!
ఈ ఉత్కంఠభరిత డ్రామా నడుస్తున్న వేళ సోమవారం రాత్రి చెపాక్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన విజయం సాధించి ప్లేఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. సీఎస్కే నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 19 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 47 బంతుల్లో 70 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, 47 పరుగులు చేసిన హెన్రిచ్ క్లాసెన్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్(3/28) అద్భుత బౌలింగ్‌తో సీఎస్కేను కట్టడి చేశాడు. మ్యాచ్ అనంతరం ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. "మేము సరైన సమయంలో లీగ్‌లో మంచి స్థానానికి చేరుకున్నాం, అసలైన పోరు (ప్లేఆఫ్స్) ఇప్పుడే మొదలవుతుంది" అని పూర్తి ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2026 చివరి లీగ్ వారం క్రికెట్ అభిమానులకు ఓ థ్రిల్లర్ సినిమాను తలపించడం ఖాయంగా కనిపిస్తోంది.

Story first published: Tuesday, May 19, 2026, 11:19 [IST]
Other articles published on May 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+