Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఒక్క మ్యాచ్‌తో రెండు జట్లు ఔట్.. IPL 2026 ప్లేఆఫ్స్‌లో నయా ట్విస్ట్!

IPL 2026 Playoffs: ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ ముగింపునకు రావడంతో ప్లేఆఫ్స్ రేసు అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. ఇప్పటికే ఈ సీజన్లో టాప్-3 స్థానాలు ఖరారైపోయాయి. ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు అధికారికంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ నెట్ రన్ రేట్ పరంగా పైచేయి సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో స్థానానికి పరిమితమైంది. ఇప్పుడు మిగిలి ఉన్న ఒకే ఒక్క నాలుగో స్థానం కోసం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య త్రిముఖ పోరు నడుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ రేసు నుంచి తప్పుకుంది.

ఓ ఒక్క మ్యాచ్ గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్!
ఈ రేసులో రాజస్థాన్ రాయల్స్ జట్టు అందరికంటే ముందు వరుసలో ఉంది. ఎందుకంటే వారి భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంది. రాజస్థాన్ రాయల్స్ తన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ.. పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తమ ఆఖరి మ్యాచ్‌ల్లో ఓడిపోతే రాజస్థాన్ ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది.

IPL 2026 Playoffs Race One Match Can Knock Out Two Teams From the Top 4 Race Full Details

పంజాబ్ ఆశలు సజీవం
మరోవైపు వరుసగా 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయినప్పటికీ పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. పంజాబ్ తదుపరి దశకు వెళ్లాలంటే మొదట తమ ఆఖరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించాలి. దాంతో పాటు రాజస్థాన్ రాయల్స్ జట్టు ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోవాలి. ఇవి మాత్రమే కాకుండా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ విజయం (దాదాపు 50 ప్లస్ పరుగుల తేడాతో) సాధించకుండా ఉండాలి. అప్పుడే నెట్ రన్ రేట్ పరంగా పంజాబ్ ముందంజలో ఉంటుంది.

కేకేఆర్ ప్లేఆఫ్స్ చేరాలంటే?
ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడటం ఓ రకంగా కలిసి వచ్చే అంశం. మిగతా జట్ల ఫలితాలను బట్టి వారు వ్యూహాలు రచించుకోవచ్చు. ఒకవేళ పంజాబ్, రాజస్థాన్ జట్లు తమ మ్యాచ్‌ల్లో ఓడిపోతే, కేకేఆర్ కేవలం తన ఆఖరి మ్యాచ్‌లో గెలిస్తే సరిపోతుంది. ఒకవేళ పంజాబ్ జట్టు గెలిస్తే.. కేకేఆర్ తన మ్యాచ్‌లో భారీ విజయాన్ని నమోదు చేసి నెట్ రన్ రేట్‌లో పంజాబ్‌ను దాటాల్సి ఉంటుంది. అయితే ఈ సమీకరణాలన్నింటికీ చెక్ పెడుతూ ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ తన మ్యాచ్‌లో గెలిస్తే మాత్రం పంజాబ్, కోల్‌కతా జట్ల ప్లేఆఫ్స్ ఆశలకు గండి పడుతుంది.

Story first published: Saturday, May 23, 2026, 14:04 [IST]
Other articles published on May 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+