IPL 2026: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ నేటి నుంచే(మార్చి 28) అట్టహాసంగా ప్రారంభం కానుంది. అసలు సిసలు టీ20 క్రికెట్ మజాను రుచి చూపించేందుకు 10 జట్లు సై అంటే సై అని దూసుకొస్తున్నాయి. వచ్చే రెండు నెలల పాటు సిక్సర్లు, ఫోర్ల వర్షంతో క్రికెట్ అభిమానులకు వినోదం పంచడానికి ఐపీఎల్ 2026 సిద్ధమైంది. పాత పగలు, కొత్త సవాళ్లతో ఈ సీజన్ మరింత రసవత్తరంగా సాగడం ఖాయం. ఐపీఎల్ 19వ ఎడిషన్‌లో గతేడాది ఛాంపియన్‌గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన టైటిల్‌ను కాపాడుకోవడానికి సిద్ధమవ్వగా.. మిగిలిన 9 జట్లు ట్రోఫీని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి. నేడు తొలి మ్యాచ్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆర్సీబీ.. పటిష్ట బ్యాటింగ్.. బలహీన బౌలింగ్?
డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ రజత్ పాటిదార్ సారథ్యంలో విజేతగా బరిలోకి దిగుతోంది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్ వంటి విధ్వంసకర బ్యాటర్లతో జట్టు బలంగా కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ ఈ సీజన్‌లో ఐపీఎల్‌లో 9000 పరుగుల మైలురాయిని దాటే అవకాశం ఉంది. అయితే బౌలింగ్ విభాగం ఆర్సీబీని కలవరపెడుతోంది. వ్యక్తిగత కారణాల వల్ల యశ్ దయాల్ దూరం కాగా.. స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ఫిట్ నెస్ సమస్యలతో తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదు. ఈ క్రమంలో చిన్నస్వామి వంటి హై-స్కోరింగ్ పిచ్ పై ఆర్సీబీ బౌలర్లు ఎలా రాణిస్తారో అనే ఆసక్తికరంగా మారింది.

ఎస్ఆర్‌హెచ్.. కొత్త కెప్టెన్‌తో సవాల్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కూడా ఎదురుదెబ్బలు తగిలాయి. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా దూరం కావడంతో జట్టు యాజమాన్యం ఇషాన్ కిషన్‌కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ వంటి స్టార్లతో బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉన్నప్పటికీ.. కమిన్స్ లేని లోటు బౌలింగ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.
తుది జట్లు (అంచనా):
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB):
ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (WK), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, రసిక్ సలామ్ దార్.
ఇంపాక్ట్ ప్లేయర్: వెంకటేష్ అయ్యర్ / సుయాష్ శర్మ.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH):
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కెప్టెన్/WK), హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్‌స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, బ్రైడన్ కార్స్, జయదేవ్ ఉనద్కత్, హర్షల్ పటేల్, జీషాన్ అన్సారీ.
ఇంపాక్ట్ ప్లేయర్: శివమ్ మావి / హర్ష్ దూబే.
మ్యాచ్ ఎక్కడ చూడాలంటే?
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్ ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్ జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఐపీఎల్ మ్యాచ్‌లన్నింటిని టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో తెలుగుతో పాటు ఇంగ్లీషు, హిందీ భాషల్లో కూడా వీక్షించవచ్చు. డిజటల్ అయితే జియో సినిమా యాప్, వెబ్‌సైట్‌లో ఉచితంగా వీక్షించవచ్చు.
మొత్తానికి బ్యాటర్లకు స్వర్గధామం వంటి చిన్నస్వామి పిచ్‌పై ఇరు జట్ల మధ్య పరుగుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది. వ్యూహప్రతివ్యూహాలతో పాటు 'ఇంపాక్ట్ ప్లేయర్' నియమం ఈ మ్యాచ్ ఫలితాన్ని శాసించే అవకాశం ఉంది.