Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI: కష్టాల్లో ముంబై ఇండియన్స్.. ప్లేఆఫ్స్ ఆశలు గాలిలో దీపమేనా?

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పరాజయం పాలవ్వడంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు కష్టంగా మారాయి. 13 ఏళ్లల నిరీక్షణ తర్వాత ఈ సీజన్లో తొలి మ్యాచ్‌ను గెలిచి ఘనంగా ఆరంభించినప్పటికీ.. ఆ తర్వాత వరుస పరాజయాలతో ముంబై పాయింట్ల పట్టికలో వెనుకబడింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఏకంగా 6 ఓటములను చవిచూసి, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది.

ఇకపై గెలిస్తేనే ముందడుగు
ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ 'డూ ఆర్ డై' వంటిదే. ప్రస్తుతం ముంబై వద్ద కేవలం 4 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ప్లేఆఫ్స్ అర్హత సాధించడానికి కనీసం 16 పాయింట్లు అవసరం. అంటే ముంబై తన చేతిలో ఉన్న మిగిలిన 6 మ్యాచ్‌ల్లోనూ తప్పనిసరిగా విజయం సాధించాలి. ఎక్కడ ఒక్క మ్యాచ్ ఓడినా ఆ జట్టు దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే. కేవలం విజయాలే కాకుండా సీఎస్కేతో జరిగిన భారీ ఓటమి వల్ల దెబ్బతిన్న నెట్ రన్-రేట్‌ను కూడా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది.

IPL 2026 Mumbai Indians Playoff Chances Fade After Loss Hardik Pandya Faces Tough Road Ahead

మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్
ముంబై ఇండియన్స్ తన తదుపరి మ్యాచ్‌లలో కఠినమైన జట్లను ఎదుర్కోవాల్సి ఉంది.

మే 2: చెన్నై సూపర్ కింగ్స్‌ (చెపాక్)

మే 4: లక్నో సూపర్ జెయింట్స్‌ (వాంఖడే)

మే 10: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రాయ్‌పూర్)

మే 14: పంజాబ్ కింగ్స్‌ (ధర్మశాల)

మే 20: కోల్‌కతా నైట్ రైడర్స్‌ (ఈడెన్ గార్డెన్స్)

మే 24: రాజస్థాన్ రాయల్స్‌ (వాంఖడే)

చరిత్ర పునరావృతమవుతుందా?
ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్ చరిత్రలో అసాధ్యమైన పరిస్థితుల నుంచి అద్భుతాలు చేసిన చరిత్ర ఉంది. 2014లో వరుసగా మొదటి ఐదు మ్యాచ్‌లు ఓడిపోయినప్పటికీ.. ఆదిత్య తారే సిక్సర్‌తో ప్లేఆఫ్స్‌కు చేరిన ఘనత ఆ జట్టుది. అలాగే 2015లోనూ మొదటి 6 మ్యాచ్‌ల్లో 5 ఓటములు ఎదురైనా, చివరకు కప్పు గెలిచి సత్తా చాటింది. రోహిత్ శర్మ నాయకత్వంలో ఐదు టైటిళ్లు సాధించిన ఈ జట్టు, ఇప్పుడు హార్దిక్ పాండ్యా సారథ్యంలో మరో చారిత్రాత్మక మలుపును ఆశిస్తోంది. ఇంకా అవకాశాలు ఉన్నందున, అభిమానులు ముంబై 'కమ్ బ్యాక్' ఇస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.

Story first published: Thursday, April 30, 2026, 9:05 [IST]
Other articles published on Apr 30, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+