Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

6,6,6,6.. సిక్సర్ల వర్షం: ఐపీఎల్ వేలంలో జాక్‌పాట్ ఖాయమా?

ఐపీఎల్ 2026 మినీ వేలానికి సరిగ్గా కొన్ని గంటల ముందు క్రికెట్ ప్రపంచంలో ఆశ్చర్యపోయేలా న్యూజిలాండ్ వికెట్ కీపర్, బ్యాటర్ టిమ్ సీఫెర్ట్ సంచలనం సృష్టించాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరఫున ఆడుతున్న టిమ్ సీఫెర్ట్.. బ్రిస్బేన్ హీట్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకునేలా చేసింది.

ఈ మ్యాచ్‌లో టిమ్ సీఫెర్ట్ బ్యాటింగ్ ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 53 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్న టిమ్ సీఫెర్ట్.. మొత్తం 56 బంతుల్లో 102 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 6 భారీ సిక్సర్లు ఉండటం వి‌శేషం. ముఖ్యంగా పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది బౌలింగ్‌ను చీల్చి చెండాడటంతో స్టేడియం హోరెత్తిపోయింది. బిగ్ బాష్ లీగ్ చరిత్రలో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరఫున సెంచరీ మార్కును అందుకున్న రెండో బ్యాటర్‌గా (ఆరోన్ ఫించ్ తర్వాత) సీఫెర్ట్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

IPL 2026 Mini Auction Tim Seifert Explosive Century Sparks Jackpot Buzz

నేడు (డిసెంబర్ 16) మధ్యాహ్నం అబుదాబిలో ఐపీఎల్ వేలం జరగనున్న తరుణంలో.. ఈ ప్రదర్శన సీఫెర్ట్ పాలిట జాక్‌పాట్‌గా మారే అవకాశం ఉంది. రూ. 1.25 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వస్తున్న అతనికి, ఈ సెంచరీ వల్ల భారీ ధర పలికే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం సీఫెర్ట్ ఉన్న భీకరమైన ఫామ్ చూస్తుంటే, ఒక ఓపెనర్‌గా లేదా ఫినిషర్‌గా అవసరమైన జట్లు అతని కోసం గట్టిగా పోటీ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా భారీ పర్స్ కలిగిన కేకేఆర్ (KKR) లేదా సీఎస్‌కే (CSK) వంటి జట్లు సీఫెర్ట్‌ను దక్కించుకోవడానికి ఆసక్తి చూపవచ్చు.

అయితే ఐపీఎల్ వేలంలో సీఫెర్ట్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. విదేశీ వికెట్ కీపర్ల విభాగంలో క్వింటన్ డికాక్, జానీ బెయిర్‌స్టో, జేమీ స్మిత్ వంటి దిగ్గజాలు రేసులో ఉండటం అతనికి కొంత సవాలుగా మారవచ్చు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ జట్లలో సభ్యుడిగా ఉన్నప్పటికీ, కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడి నిరూపించుకోవడానికి సరైన అవకాశం దక్కలేదు. కానీ తాజా బిగ్ బాష్ లీగ్ సెంచరీతో అతను తన సత్తాను ప్రపంచానికి చాటిచెప్పాడు. వేలానికి ముందే వచ్చిన ఈ మెరుపు ఇన్నింగ్స్ అతని ఐపీఎల్ కెరీర్‌ను ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.

Story first published: Tuesday, December 16, 2025, 12:41 [IST]
Other articles published on Dec 16, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+