వావ్.. వాట్ ఏ క్యాచ్: దెబ్బకు నోరెళ్లబెట్టిన విరాట్ కోహ్లీ! (వీడియో)
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆర్సీబీ, కేకేఆర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఓ అద్భుతమైన క్యాచ్‌కు వేదికైంది. కేకేఆర్ స్టార్ ప్లేయర్ మనీష్ పాండే గాలిలో ఎగురుతూ ఒంటి చేత్తో పట్టిన క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్ కొట్టిన బుల్లెట్ లాంటి షాట్‌ను మనీష్ పాండే అసాధ్యమైన రీతిలో క్యాచ్‌గా మలిచాడు. దీనిని చూసిన అభిమానులు, విశ్లేషకులు ఈ సీజన్లోనే బెస్ట్ క్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు.
ఈ విన్యాసం ఆర్సీబీ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో చోటుచేసుకుంది. కార్తీక్ త్యాగి వేసిన ఐదో బంతిని టిమ్ డేవిడ్ పవర్‌ఫుల్‌గా కట్ షాట్ ఆడాడు. అది కచ్చితంగా బౌండరీ వెళ్తుందని అందరూ భావించారు. కానీ బ్యాక్‌వర్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న మనీష్ పాండే చిరుతపులిలా తన ఎడమ వైపునకు గాలిలో డైవ్ చేసి కేవలం ఒక చేత్తో బంతిని ఒడిసిపట్టాడు. థర్డ్ అంపైర్ రిప్లేలను పరిశీలించిన తర్వాత అది క్లీన్ క్యాచ్ అని తేల్చడంతో టిమ్ డేవిడ్ నిరాశగా వెనుదిరిగాడు. ఈ క్యాచ్ పట్టిన తర్వాత మనీష్ పాండే చాలా సాధారణంగా ఉన్నప్పటికీ.. స్టేడియంలోని మిగిలిన వారంతా షాక్‌కు గురయ్యారు.

మనీష్ పాండే విన్యాసానికి నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు. బౌలర్ కార్తీక్ త్యాగి నమ్మలేనట్లుగా తన తల పట్టుకోగా.. బ్యాటర్ టిమ్ డేవిడ్ ఏం జరిగిందో అర్థం కాక కాసేపు క్రీజులోనే ఉండిపోయాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ స్వయంగా మనీష్ పాండేను అభినందించాడు. వీరిద్దరూ 2008 అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సహచరులు కావడం విశేషం. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలో చరిత్రలో శతకం బాదిన తొలి భారతీయుడిగా(2009లో ఆర్సీబీ తరఫున) మనీష్ పాండేకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
మ్యాచ్ పరిస్థితి ఇలా..
ఆర్సీబీ, కేకేఆర్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 192 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ.. విరాట్ కోహ్లీ అజేయ సెంచరీ(105*) పుణ్యమా అని ఆర్సీబీ మరో 5 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. మనీష్ పాండే క్యాచ్ కేకేఆర్ జట్టులో ఉత్సాహం నింపినప్పటికీ.. కోహ్లీ ఇన్నింగ్స్ ముందు వారి శ్రమ ఫలించలేదు. మనీష్ పాండే వయస్సు 36 ఏళ్లు అయినప్పటికీ, అతని ఫీల్డింగ్ నైపుణ్యం ఇంకా తగ్గలేదని ఈ క్యాచ్ నిరూపించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications