Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

15 ఏళ్ల పిల్లాడిని చూసి భయపడ్డా: స్టార్ బౌలర్

ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఢిల్లీ స్టార్ పేసర్ కైల్ జేమీసన్ వేసిన అద్భుతమైన యార్కర్ బంతికి రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే వైభవ్ వికెట్ తీసిన ఆనందంలో కైల్ జేమీసన్.. ఆ 15 ఏళ్ల కుర్రాడికి అతి దగ్గరగా వెళ్లి చప్పట్లు కొడుతూ దూకుడుగా సెండాఫ్ ఇచ్చాడు. ఓ సీనియర్ ప్లేయర్ చిన్న పిల్లాడితో ఇలా ప్రవర్తించడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆ కుర్రాడిని చూసి భయపడ్డాను: జేమీసన్
ఈ వివాదంపై స్పందించిన జేమీసన్.. వైభవ్ సూర్యవంశీ ఆటతీరును ప్రశంసించాడు. "నా జీవితంలో 15 ఏళ్ల పిల్లాడిని చూసి ఇంతలా భయపడతానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ వైభవ్ భయం లేని ఆటగాడు. అతని కోసం మేము ప్రత్యేక ప్రణాళికలు రచించాం. రాజస్థాన్ జట్టుకు ఓపెనర్లు వైభవ్, జైస్వాల్ ఇచ్చే ఆరంభం చాలా కీలకం. అందుకే వారిని త్వరగా ఔట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ ప్లాన్ వర్కౌట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకే అలా సెలబ్రేషన్ చేశాను." అని కైల్ జేమీసన్ పేర్కొన్నాడు.

IPL 2026 Kyle Jamieson Reacts to Vaibhav Sooryavanshi Send-off Controversy Admits Being Scared

పవర్‌ప్లేలో ప్లాన్ సక్సెస్:
రాజస్థాన్ రాయల్స్ జట్టు టాపార్డర్‌ను దెబ్బతీయడమే తమ ప్రధాన ఉద్దేశమని జేమీసన్ వివరించాడు. పవర్‌ప్లేలో పరుగుల వేగాన్ని అడ్డుకోవడానికి మిచెల్ స్టార్క్, తాను కలిసి చేసిన ప్రయత్నం ఫలించిందని చెప్పాడు. స్టార్క్ హై ఫుల్ టాస్‌తో ఒక వికెట్ తీయగా.. తాను అద్భుతమైన యార్కర్‌తో వైభవ్ వికెట్ తీయడం వల్ల రాజస్థాన్ భారీ స్కోరు చేసే అవకాశాన్ని అడ్డుకోగలిగామని తెలిపాడు.

బీసీసీఐ యాక్షన్ - జేమీసన్ తప్పు అంగీకారం:
జేమీసన్ మాటలు ఎలా ఉన్నా.. మైదానంలో అతను ప్రదర్శించిన దూకుడును బీసీసీఐ తీవ్రంగా పరిగణించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతనికి ఓ డెమెరిట్ పాయింట్‌తో పాటు జరిమానా కూడా విధించింది. జేమీసన్ కూడా తన తప్పును అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ శిక్షను ఖరారు చేశారు. ఢిల్లీ మ్యాచ్ గెలిచినప్పటికీ, జేమీసన్ ప్రవర్తన మాత్రం ఈ మ్యాచ్‌లో ఓ మాయని మచ్చలా మిగిలిపోయింది.

Story first published: Saturday, May 2, 2026, 14:12 [IST]
Other articles published on May 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+