IPL 2026: కేకేఆర్ ప్లే-ఆఫ్ ఆశలు గల్లంతేనా?
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా అజింక్యా రహానే సారథ్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలవ్వడంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్.. ఏకంగా 5 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఈ క్రమంలో ఆ జట్టు ప్లే-ఆఫ్ చేరడం ఇప్పుడు ఓ అద్భుతం జరిగితే తప్ప సాధ్య కాని పనిగా కనిపిస్తోంది.
గుజరాత్‌తో మ్యాచ్‌లో ఏం జరిగిందంటే?
గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన పోరులో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టులో కామెరూన్ గ్రీన్ 79 పరుగులతో మెరుపులు మెరిపించినప్పటికీ.. మిగిలిన ప్లేయర్ల వైఫల్యం వల్ల ఆ జట్టు 180 పరుగులకే పరిమితమైంది. అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 86 పరుగులతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి తన జట్టును 19.4 ఓవర్లలో విజయతీరాలకు చేర్చాడు. ఈ గెలుపుతో గుజరాత్ టైటాన్స్ హ్యాట్రిక్ నమోదు చేయగా.. కేకేఆర్ వరుస పరాజయాలతో సతమతమవుతోంది.

ప్లే-ఆఫ్ చేరాలంటే ఉన్న సమీకరణాలివే!
ప్రస్తుతం కేకేఆర్ ఖాతాలో కేవలం ఒక పాయింట్ మాత్రమే ఉంది. అది కూడా పంజాబ్‌తో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో లభించిన పాయింట్. నెట్ రన్ రేట్ కూడా -1.149కి పడిపోవడంతో ఆ జట్టు పరిస్థితి మరింత దిగజారింది. కేకేఆర్ ప్లే-ఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన 8 మ్యాచ్‌ల్లో కనీసం 7 లేదా అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ 8కి 8 మ్యాచ్‌లు గెలిస్తే 17 పాయింట్లతో నేరుగా ప్లే-ఆఫ్ చేరవచ్చు. 7 మ్యాచ్‌లు గెలిస్తే 15 పాయింట్లతో ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
రహానే సేన పుంజుకుంటుందా?
వరుస పరాజయాలతో నైతిక బలం కోల్పోయిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు రాబోయే ప్రతి మ్యాచ్ నాకౌట్ లాంటిదే. ఒక్క ఓటమి ఎదురైనా ప్లే-ఆఫ్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించినట్లే. మరి 3 సార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ఈ చారిత్రక జట్టు.. కెప్టెన్ అజింక్య రహానే ఆధ్వర్యంలో అద్భుతం చేసి తదుపరి 8 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తుందో లేదో వేచి చూడాలి. ఈ కష్టతరమైన లక్ష్యాన్ని చేరుకోవడం కేకేఆర్ ఆటగాళ్లకు ఓ పెద్ద సవాలుగా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications