Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అభిషేక్ శర్మకు బౌలింగ్ అంటే విసుగొచ్చేసింది: ఆర్సీబీ స్టార్ పేసర్

ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే క్రికెట్ ఫ్యాన్స్‌కు అసలైన వినోదం దొరికింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన పోరులో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ తొలి మ్యాచ్‌లోనే ఆర్సీబీ సంచలన విజయం నమోదు చేయడంలో బ్యాటర్లతో పాటు కివీస్ పేసర్ జాకబ్ డఫీ కీలక పాత్ర పోషించాడు. హైదరాబాద్ భారీ స్కోరు చేసినప్పటికీ, ఆర్సీబీ బౌలర్ జాకబ్ డఫీ బౌలింగ్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. తన అరంగేట్రం మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ వేగవగంతమైన బౌలర్ డఫీ అద్భుతమైన స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు తీసి హైదరాబాద్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. 4 ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టడం విశేషం.

హేజిల్‌వుడ్ పాత్రలో ఒదిగిపోయిన డఫీ
తన అరంగేట్ల మ్యాచ్‌లోనే 3 వికెట్లు పడగొట్టి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలుచుకున్న జాకబ్ డఫీ.. మ్యాచ్ అనంతరం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ జోష్ హేజిల్‌వుడ్‌తో తనను తాను పోల్చుకుంటూ సరదాగా మాట్లాడాడు. "ఈ సీజన్‌ను గెలుపుతో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడ కేవలం హేజిల్‌వుడ్ (పెద్దాయన) సీటును కాపాడుతున్నాను.. అంతే (అంటే ఆయన వచ్చే వరకు ఆ బాధ్యతను మోస్తున్నానని అర్థం). జోష్ హేజిల్‌వుడ్ గతంలో ఇక్కడ ఏం చేశాడో, దాన్నే నేను కొనసాగించాలని అనుకున్నాను. సరైన లెంగ్త్‌లో బంతులు వేయడంపైనే దృష్టి పెట్టాను" అని జాకబ్ డఫీ పేర్కొన్నాడు.

IPL 2026 Jacob Duffy 3-Wicket Haul Leads RCB to Victory Over SRH Fun Comments on Abhishek Sharma

అభిషేక్‌కు బౌలింగ్ చేయడంపై ఫన్నీ కామెంట్స్
టీ20 వరల్డ్ కప్‌లో అనుభవాలను గుర్తు చేసుకుంటూ జాకబ్ డఫీ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. "అభిషేక్ శర్మకు బౌలింగ్ చేసి చేసి నాకు విసుగు వచ్చేసింది. కానీ ఈరోజు పిచ్‌పై మంచి బౌన్స్ ఉంది. భారత్‌లో ఇంతటి బౌన్స్‌ను నేను ఎప్పుడూ చూడలేదు. కొత్త బంతితో హార్డ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయడం వల్ల వికెట్లు దక్కాయి. కెప్టెన్ రజత్ పాటిదార్ వరుసగా నాలుగు ఓవర్లు వేయమంటే సంతోషంగా ఒప్పుకున్నాను" అని జాకబ్ డఫీ వివరించాడు.

మ్యాచ్‌ను మలుపు తిప్పిన 4 ఓవర్ల స్పెల్
పవర్‌ప్లేలో జాకబ్ డఫీ వేసిన 4 ఓవర్ల స్పెల్ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. కేవలం 22 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీయడం వల్ల హైదరాబాద్ భారీ స్కోరు చేసే అవకాశం కోల్పోయింది. చివరకు ఆర్‌సీబీ కేవలం 15.4 ఓవర్లలోనే 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది.

Story first published: Sunday, March 29, 2026, 9:05 [IST]
Other articles published on Mar 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+