Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అది ఐపీఎల్ పవర్! పాక్ గడ్డపై రూ.500 కోట్ల సామ్రాజ్యం!!

భారత్-పాకిస్థాన్ దాయాది దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఎన్ని ఉన్నా.. క్రికెట్ క్రేజ్ మాత్రం అన్ని హద్దులను చెరిపేస్తోంది. పాకిస్థాన్‌లో ఐపీఎల్ అధికారికంగా ప్రసారం కాకపోయినా.. అక్కడ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సృష్టిస్తున్న ఆర్థిక విలువ విస్తుపోయేలా చేస్తోంది. తాజా గణాంకాల ప్రకారం.. పాకిస్థాన్‌లో ఐపీఎల్ షాడో మార్కెట్ విలువ ఏడాదికి దాదాపు రూ.500 కోట్లుగా అంచనా వేయబడింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పాకిస్థాన్ స్వదేశీ లీగ్ అయిన పీఎస్ఎల్ వార్షిక ఆదాయం కంటే ఐపీఎల్ అక్రమ మార్కెట్ విలువ కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఉండటం విశేషం.

అధికారికంగా నిషేధం.. అనధికారికంగా అద్భుతం!
భారత ప్రభుత్వం పీఎస్ఎల్ ప్రసారాలను నిషేధించగా.. ప్రతిస్పందనగా పాకిస్థాన్ కూడా ఐపీఎల్ అధికారిక ప్రసారాలను ఆపివేసింది. కానీ క్రికెట్ అభిమానులను ఈ నిషేధాలు ఏ మాత్రం ఆపలేకపోతున్నాయి. పాక్ అభిమానులు ఐపీఎల్ చూడటానికి ఐపీటీవీ(IPTV), టెలిగ్రామ్ గ్రూపులు, చట్టవిరుద్ధమైన స్ట్రీమింగ్ వెబ్‌సైట్లను ఆశ్రయిస్తున్నారు. ఈ విధంగా పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ల ద్వారా దాదాపు రూ.150 నుంచి రూ.300 కోట్ల ఆదాయం సమకూరుతుండగా.. మిగిలిన మొత్తం ప్రకటనలు, ఇతర మార్గాల ద్వారా లభిస్తోంది. దీనివల్ల ఐపీఎల్ ఎటువంటి అధికారిక పెట్టుబడి లేకుండానే పాక్ మార్కెట్లో పాగా వేసింది.

IPL 2026 Indian Premier League Creates Rs 500 Cr Shadow Market in Pakistan Despite Official Ban

పీఎస్ఎల్ కంటే ఐపీఎల్‌కే ప్రాధాన్యత?
పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) వార్షిక ఆర్థిక విలువ దాదాపు రూ.300 నుంచి రూ.370 కోట్లుగా ఉంటే.. కేవలం చట్టవిరుద్ధ మార్గాల్లోనే ఐపీఎల్ అక్కడ రూ.500 కోట్ల విలువను చేరుకోవడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం పాకిస్థాన్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి భారత స్టార్ ఆటగాళ్లకు ఉన్న అభిమానమే. పాక్ యూట్యూబర్లు, కంటెంట్ క్రియేటర్లు కూడా పీఎస్ఎల్ కంటే ఐపీఎల్ మ్యాచ్‌లపై విశ్లేషణలు చేసినప్పుడే తమకు ఎక్కువ వ్యూస్, ఆదాయం వస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. ఇది ఐపీఎల్ బ్రాండ్ పవర్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.

ఐపీఎల్ వైపు మళ్లడానికి కారణమిదే..
పాకిస్థాన్ క్రికెట్లో వసీం అక్రమ్, షోయబ్ అక్తర్ వంటి గ్లోబర్ సూపర్ స్టార్లు ప్రస్తుత కాలంలో లేకపోవడం కూడా ఐపీఎల్ వైపు ఆ దేశ అభిమానులు మళ్లడానికి ఓ కారణం. ఐపీఎల్ వీడియోలు, రియాక్షన్ల ద్వారా అక్కడి డిజిటల్ క్రియేటర్లు సీజన్‌‌కు రూ.20 నుంచి రూ.60 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. పైరసీ సైట్లలో వచ్చే బెట్టింగ్, పాప్-అప్ ప్రకటనల ద్వారా మరో రూ.80 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ విధంగా ఎవరికీ చెందిన ఓ భారీ వ్యవస్థ పాకిస్థాన్‌లో ఐపీఎల్ చుట్టూ ఏర్పడింది.

ఓ దేశంలో అధికారికంగా అడుగుపెట్టకుండా, ఎటువంటి మీడియా హక్కులు లేకుండా కేవలం డిమాండ్ ఆధారంగా రూ.500 కోట్ల మార్కెట్‌ను సృష్టించడం ఐపీఎల్‌కే చెల్లింది. సరిహద్దులుఆటను ఆపగలవు కానీ.. అభిమానుల ఆసక్తిని, ఆ క్రీడ వెనుక ఉన్న ఆర్థిక చైతన్యాన్ని ఆపలేవని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.

Story first published: Wednesday, April 8, 2026, 15:56 [IST]
Other articles published on Apr 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+