Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబైకి ముద్దు.. ఢిల్లీకి వద్దా? ఐపీఎల్ అంపైర్ల వివక్షపై నెటిజన్ల ఫైర్!

ఐపీఎల్ 2026 సీజన్లో అంపైరింగ్ నిర్ణయాలు ఇప్పుడు పెనువివాదానికి దారితీస్తున్నాయి. ఒకే రకమైన పరిస్థితిలో ఇద్దరు ఆటగాళ్ల పట్ల అంపైర్లు భిన్నంగా వ్యవహరించడంపై క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు లభించిన వెసులుబాటు.. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ ట్రిస్టన్ స్టబ్స్‌కు నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ముంబై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్‌లో ఏం జరిగింది?
ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రెండుసార్లు తన గ్లౌజులను మార్చుకున్నాడు. ఓవర్ల మధ్యలో ఆయన గ్లౌజులను మారుస్తున్నప్పుడు మైదానంలోని అంపైర్లు కానీ, ఫోర్త్ అంపైర్ కానీ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. హార్దిక్ పాండ్యాకు ఎంతో సులభంగా కొత్త గ్లౌజులు అందుబాటులోకి వచ్చాయి.

IPL 2026 Hardik Pandya vs Tristan Stubbs Glove Controversy Umpiring Double Standards

ట్రిస్టన్ స్టబ్స్‌కు ఎదురైన చేదు అనుభవం
అయితే దీనికి సరిగ్గా 24 గంటల ముందు జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పరిస్థితి మరోలా ఉంది. ఢిల్లీ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ కొత్త గ్లౌజులు కావాలని కోరగా.. అంపైర్లు అందుకు ససేమిరా అన్నారు. గ్లౌజులు మార్చుకోవడానికి వీల్లేదని కఠినంగా ఆదేశించారు. ఈ వివక్షపై అభిమానులు మండిపడుతున్నారు. ఆటగాళ్ల పాపులారిటీని బట్టి ఐపీఎల్‌లో నియమాలు మారిపోతాయా అని ప్రశ్నలు కురిపిస్తున్నారు.

నితీష్ రాణాపై జరిమానా వేటు
శనివారం నాటి మ్యాచ్‌లో ట్రిస్టన్ స్టబ్స్ కోసం గ్లౌజులు తీసుకుని మైదానంలోకి వెళ్తున్న నితీష్ రాణాను ఫోర్త్ అంపైర్ బౌండరీ లైన్ వద్దే అడ్డుకున్నారు. ఈ క్రమంలో అంపైర్‌తో నితీష్ రాణా వాగ్వాదానికి దిగడంతో, బీసీసీఐ ఆయనపై చర్యలు తీసుకుంది. క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు గాను నితీష్ రాణా మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది.ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా కేటాయించింది.మరోవైపు గ్లౌజులు మార్చుకునే అవకాశం ఇవ్వకపోవడంతో తీవ్ర అసహనానికి గురైన స్టబ్స్, అవుట్ అయిన తర్వాత తన బ్యాట్‌ను కోపంతో విసిరికొట్టాడు.

అభిమానుల ఆగ్రహం
కేవలం 24 గంటల వ్యవధిలో రూల్స్ ఎలా మారిపోతాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఓ స్టార్ ఆటగాడికి ఒక రూల్, యువ ఆటగాడికి మరో రూల్ ఉండటం క్రికెట్ స్పిరిట్‌కు విరుద్ధమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంపైరింగ్‌లో ఇటువంటి వైరుధ్యాలు ఐపీఎల్ వంటి ప్రతిష్టాత్మక లీగ్ ప్రతిష్టను దెబ్బతీస్తాయని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Story first published: Monday, April 13, 2026, 7:56 [IST]
Other articles published on Apr 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+