హార్దిక్ పాండ్యాకు మరో షాక్!
కేకేఆర్ చేతిలో ఘోర ఓటమి తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు మరో షాక్ తగిలింది. ఈ పరాజయం ముంబై ఇండియన్స్ జట్టుకో ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోగా.. కెప్టెన్ హార్ధిక్ పాండ్యాకు బీసీసీఐ గట్టి షాక్ ఇచ్చింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో నిరాశతో ప్రవర్తించిన తీరు, అంపైర్ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేయడం వల్ల హార్దిక్ పాండ్యాపై బీసీసీఐ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను హార్దిక్ మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది.
ఆ వివాదం కోల్‌కతా ఇన్నింగ్స్ 10వ ఓవర్ సమయంలో జరిగింది. మైదానంలో క్యాచ్‌లు డ్రాప్ అవ్వడం, చెత్త ఫీల్డింగ్ కారణంగా ముంబై చేతుల్లోంచి మ్యాచ్ జారిపోతుండటంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. ఓవర్ నాలుగో బంతి వేసిన తర్వాత తిరిగి రన్-అప్ వైపు వెళ్తుండగా.. తీవ్ర ఆగ్రహంతో వికెట్లపై చేత్తో కొట్టి బెయిల్స్‌ను కింద పడేశాడు. మైదానంలో హార్దిక్ పాండ్యా ప్రవర్తించిన ఈ తీరును ఐపీఎల్ ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా బీసీసీఐ పరిగణించింది.

ఐపీఎల్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. హార్దిక్ పాండ్యా ప్లేయర్లు, జట్టు అధికారుల కోసం రూపొందించిన ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని లెవెల్-1 నిబంధనను ఉల్లంఘించినట్లు తేలింది. హార్దిక్ పాండ్యా ఆర్టికల్ 2.2 ని అతిక్రమించాడు. ఈ నిబంధన మ్యాచ్ సమయంలో క్రికెట్ పరికరాలు, దుస్తులు, గ్రౌండ్ వస్తువులను దుర్వినియోగం చేయడాన్ని నిషేధిస్తుంది. ఈ ప్రవర్తన కారణంగా జరిమానాతో పాటు, హార్దిక్ పాండ్యా ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చారు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మ్యాచ్ రెఫరీ రాజీవ్ సేథ్ ముందు తన తప్పును అంగీకరించాడు. తనపై విధించిన ఈ జరిమానాను అతను ఏకీభవించాడు. లెవెల్-1 నిబంధనల ప్రకారం మ్యాచ్ రెఫరీ తీసుకునే నిర్ణయమే అంతిమమైనది కాబట్టి, ఈ విషయంలో ఎలాంటి తదుపరి అధికారిక విచారణ ఉండబోదు. ఒకవైపు కెప్టెన్సీపై కత్తి వేలాడుతుండగా.. మరోవైపు ఈ జరిమానా పడటం హార్దిక్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications