ఫైనల్ మ్యాచ్‌కు వాన గండం.. ఆ జట్టుకు లక్కీ ఛాన్స్!
IPL 2026 Final: నేడు(మే 31) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరగాల్సిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. భారత వాతావరణ శాఖ అహ్మదాబాద్‌తో పాటు గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతే కాకుండా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ వాతావరణ మార్పుల వల్ల మ్యాచ్ సజావుగా సాగుతుందా లేదా అనే ఆందోళన అభిమానుల్లో మొదలైంది.
ఐపీఎల్ ప్లేఆఫ్ నిబంధనల ప్రకారం.. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగితే మ్యాచ్‌ను వీలైనంత వరకు పూర్తి చేయడానికి అదనపు సమయం కేటాయిస్తారు. ఓవర్లను కుదించి అయినా కనీసం చెరో 5 ఓవర్ల మ్యాచ్‌ను నిర్వహించడానికి ప్రయత్నిస్తారు. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత వర్షం పడితే, విజేతను నిర్ణయించడానికి 'డక్‌వర్త్ లూయిస్' పద్ధతిని ఉపయోగిస్తారు. సమయం చాలా తక్కువగా ఉండి, వాతావరణం సహకరిస్తే కేవలం 'సూపర్ ఓవర్' ద్వారా కూడా విజేతను తేల్చే అవకాశం ఉంటుంది.

ఒకవేళ వాతావరణం అస్సలు అనుకూలించక.. మ్యాచ్‌తో పాటు సూపర్ ఓవర్ నిర్వహించడం కూడా సాధ్యం కాకపోతే.. ఐపీఎల్ నిబంధనల ప్రకారం లీగ్ దశ పాయింట్ల పట్టిక ఆధారణంగా విజేతను ప్రకటిస్తారు. ఐపీఎల్ నిబంధనల సెక్షన్ 16.11.2 ప్రకారం, లీగ్ దశలో ఏ జట్టు అయితే అగ్రస్థానంలో లేదా మెరుగైన ర్యాంకింగ్‌లో ఉంటుందో, ఆ జట్టునే విజేతగా ప్రకటిస్తారు. ప్రస్తుత సమీకరణాల ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు గుజరాత్ టైటాన్స్ కంటే మెరుగైన స్థానంలో ఉంది. కాబట్టి వర్షం వల్ల మ్యాచ్ పూర్తిగా రద్దయితే ఆర్సీబీ నేరుగా ఐపీఎల్ 2026 ఛాంపియన్‌గా అవతరిస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications