ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్!
IPL 2026: ఐపీఎల్ 2026 ఫైనల్లో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ కీలక మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలోనే ఆర్సీబీ ఫ్రాంచైజీ వరుసగా రెండో ఏడాది కూడా ఐపీఎల్ కప్‌ను ముద్దాడి సరికొత్త రికార్డు సృష్టించాలని అభిమానులు ఎంతగానో ఆశిస్తున్నారు. అయితే ఈ మహాసంగ్రామానికి ముందే బెంగళూరు క్రికెట్ అభిమానులకు అక్కడి పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. నగరంలో బహిరంగంగా ఐపీఎల్ వేడుకలు జరుపుకోవడంపై బెంగళూరు పోలీసులు పూర్తిగా నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
బెంగళూరు పోలీసులు ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకోవడం వెనుక గతేడాది జరిగిన ఓ చేదు అనుభవం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ తొలిసారి టైటిల్ గెలిచినప్పుడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. అయితే ఆ సమయంలో స్టేడియం బయట ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అప్పట్లో ఆర్సీబీ యాజమాన్యం వైఫల్యంగా, పోలీసుల నిర్లక్ష్యంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో ఈ సారి ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని భావించిన బెంగళూరు పోలీస్ శాఖ ముందస్తుగానే కఠినమైన ఆంక్షలను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

బెంగళూరు నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ట్రాఫిక్ జామ్‌లు, అవాంఛనీయ సంఘటనలను అరికట్టడానికి ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా బహిరంగ ప్రదేశాలలో మ్యాచ్‌లు వీక్షించేందుకు వీలుగా ఏర్పాటు చేసే పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై నిషేధం విధించారు. మాల్స్, పబ్‌లు, ఇతర బహిరంగ ప్రదేశాలలో సాధారణ ప్రజల కోసం లైవ్ బ్రాడ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేయవద్దని యాజమాన్యాలను కోరారు. అలాగే రోడ్లపై బైక్ ర్యాలీలు తీయడం, పటాకులు కాల్చడంపై కూడా పూర్తిగా ఆంక్షలు విధించారు.
దీంతో పాటు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, గొడవలకు దిగడం వంటి పనులు చేస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు గట్టిగా హెచ్చరించారు. నగర ప్రజలంతా క్రమశిక్షణతో, ప్రశాంతంగా ఉంటూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గత ఏడాది కప్ గెలిచిన ఆనందంలో ఉన్న ఆర్సీబీ అభిమానులకు, ఈసారి డబుల్ ధమాకా సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకున్న తరుణంలో పోలీసుల నుంచి వచ్చిన ఈ ప్రకటన తీవ్ర నిరాశను మిగిల్చిందనే చెప్పాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications