SRH vs RR: ఆ ఒక్కడిని ఔట్ చేసేందుకు SRH కెప్టెన్ మాస్టర్‌ప్లాన్!
SRH vs RR: చండీగఢ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరగనున్న ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు అంతటా ఒకే పేరు మారుమోగుతోంది.. అదే వైభవ్ సూర్యవంశీ. ఈ డూ ఆర్ డై మ్యాచ్‌కు ముందు ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ విలేకరులతో మాట్లాడుతూ, ఈ 15 ఏళ్ల యువ సంచలనాన్ని అడ్డుకోవడానికి తమ జట్టు కేవలం ఒకే ఒక వ్యూహంతో కాకుండా ప్రత్యేకంగా 'ప్లాన్ బి', 'ప్లాన్ సి'లతో సిద్ధంగా ఉందని సంచలన ప్రకటన చేశాడు. ఈ సీజన్‌లో వైభవ్ ఆడుతున్న విధ్వంసకర బ్యాటింగ్ శైలి తమకు పెద్ద సవాల్ అని కమిన్స్ అంగీకరించాడు.
ఐపీఎల్ 2026ను శాసిస్తున్న 15 ఏళ్ల వండర్ బాయ్
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్ ఐపీఎల్‌ను ఓ తుఫానులా చుట్టేశాడు. అతి చిన్న వయసులోనే ఎంతో నిర్భయంగా బ్యాటింగ్ చేస్తూ పవర్ ప్లేలో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ 15 ఏళ్ల కుర్రాడు లీగ్ దశలోని 14 ఇన్నింగ్స్‌లలో 232.27 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 583 పరుగులు సాధించి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో వైభవ్ గోల్డెన్ డకౌట్ అయినప్పటికీ.. రెండో మ్యాచ్‌లో మాత్రం ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లపై విరుచుకుపడి ఊహించని రేంజ్‌లో సెంచరీ బాదాడు. లీగ్ దశలోని రెండు మ్యాచ్‌ల్లోనూ హైదరాబాద్ గెలిచినప్పటికీ.. వైభవ్ సూర్యవంశీ ప్రస్తుత ఫామ్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో తమకు పెద్ద ముప్పుగా మారే అవకాశం ఉందని ప్యాట్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు.

వైభవ్‌ను కట్టడి చేసేందుకు కమిన్స్ మైండ్ గేమ్
ఈ కీలక మ్యాచ్‌కు ముందు ఓ ఇంటర్వ్యూలో ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. "బౌలర్‌గా మన బలాలు ఏంటో తెలుసుకుని బౌలింగ్ చేయడం ఒక ఎత్తు. కానీ ప్రత్యర్థి జట్టులో మ్యాచ్‌ను ఒంటిచేత్తో లాగేసుకునే ఒకరిద్దరు ఆటగాళ్లు ఉన్నప్పుడు, వారి కోసం ప్లాన్ బి లేదా ప్లాన్ సి సిద్ధం చేసుకోవడానికి మేము ఎక్కువ సమయం కేటాయిస్తాం. వైభవ్ సూర్యవంశీ కోసం మేము ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నాం. గత మ్యాచ్‌లో అతను మాపై సెంచరీ చేసినప్పటికీ, కొన్ని ఓవర్లలో మేము అతడిని బాగానే కట్టడి చేయగలిగాం. ఆ మ్యాచ్ నుంచి మేము నేర్చుకున్న పాఠాలు ఈ ఎలిమినేటర్‌లో ఉపయోగపడతాయి" అని ప్యాట్ కమిన్స్ వెల్లడించాడు.
సున్నా నుంచి మొదలుపెడతాం: కమిన్స్
లీగ్ దశలో రాజస్థాన్‌ను రెండుసార్లు ఓడించడం ఈ నాకౌట్ మ్యాచ్‌లో ఎలాంటి ప్రభావం చూపుతుందనే ప్రశ్నకు కమిన్స్ చాలా పరిణతితో సమాధానమిచ్చాడు. "ప్లేఆఫ్స్ మ్యాచ్ అంటే మేము మళ్లీ సున్నా నుండే ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే గత మ్యాచ్‌ల నుంచి మేము కొన్ని కీలక విషయాలను గ్రహించాం. రాజస్థాన్ ప్లేయర్ల ఆటతీరుపై మాకు పూర్తి అవగాహన ఉంది. మా జట్టులోని చాలా మంది బౌలర్లు, బ్యాటర్లు గత మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌పై మంచి సక్సెస్ సాధించారు. ఫైనల్స్ రేసులోకి వెళ్లేటప్పుడు మనం గతంలో గెలిచిన జట్టుతోనే మళ్లీ తలపడటం ఎప్పుడైనా మానసికంగా కొండంత అండనిస్తుంది" అని ప్యాట్ కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications