IPL 2026: ఢిల్లీకి ప్లేఆఫ్స్ ఛాన్స్?
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. శుక్రవారం తమ సొంత మైదానమైన అరుణ్ జైట్లీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలవ్వడం ఢిల్లీ ప్లేఆఫ్స్ అవకాశాలను తీవ్రంగా దెబ్బతీసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే నిర్ణయాన్ని బౌలర్లు సమర్థవంతంగా అమలు చేయడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 142 పరుగులు మాత్రమే చేయగలిగింది.
143 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఢిల్లీ బౌలర్లు ఆరంభంలోనే షాకిచ్చారు. రహానే (13), అంగ్‌క్రిష్ రఘువంశీ (1)లను త్వరగానే పెవిలియన్‌కు పంపినప్పటిక.., ఆ తర్వాత ఢిల్లీ బౌలర్లు పట్టు బిగించలేకపోయారు. మిగిలిన బ్యాటర్లు ఎంతో సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించడంతో ఢిల్లీకి ఈ సీజన్‌లో 7వ ఓటమి ఎదురైంది. కేకేఆర్ స్టార్ బ్యాటర్ ఫిన్ అలెన్ సెంచరీ(47 బంతుల్లో 100)తో చెలరేగడంతో సునాయాసంగా విజయం సాధించారు. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు ఈ ఓటమి పెద్ద తలనొప్పిగా మారింది.

ప్రస్తుతం పాయింట్ల పట్టికను గమనిస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్‌లు ఆడి కేవలం 8 పాయింట్లతో ఉంది. లీగ్ దశలో ఆ జట్టుకు ఇంకా మూడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒకవేళ ఢిల్లీ తన తదుపరి మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించినా.. ఆ జట్టు గరిష్టంగా 14 పాయింట్లకు మాత్రమే చేరుకోగలదు. సాధారణంగా ఐపీఎల్ చరిత్రలో 14 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం అనేది ఇతర జట్ల గెలుపోటములపై, నెట్ రన్ రేట్‌పై పూర్తిగా ఆధారపడి ఉంటుంది.
ఢిల్లీకి ఇప్పుడు ప్రతి మ్యాచ్ 'డూ ఆర్ డై' వంటిదే. ఒక్క మ్యాచ్‌లో ఓడినా టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమిస్తుంది. ఢిల్లీ తన తదుపరి పోరాటాన్ని మే 11న ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో సాగించనుంది. ఆ తర్వాత మే 17న రాజస్థాన్ రాయల్స్‌తో, మే 24న తిరిగి కోల్‌కతాతో తలపడాల్సి ఉంది. తమ విజయాలతో పాటు పాయింట్ల పట్టికలో ఎగువన ఉన్న జట్లు ఓడిపోవాలని కూడా ఢిల్లీ ప్రార్థించాల్సి ఉంటుంది. అక్షర్ సేన ఏదైనా అద్భుతం చేస్తే తప్ప ప్లేఆఫ్స్ చేరడం అసాధ్యంగా కనిపిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications