IPL 2026: రూ.25 కోట్ల ఆటగాడి రనౌట్.. కేకేఆర్ కొంపముంచిన వింత నియమం!(వీడియో)
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ వింత రనౌట్ చర్చనీయాంశంగా మారింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ భారీ ధరను వెచ్చించి కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ కామెరూన్ గ్రీన్.. కేవలం ఓ చిన్న తప్పు, క్రికెట్ నియమం కారణంగా పెవిలియన్ చేరాల్చి వచ్చింది.
అసలేం జరిగిందంటే?
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ 6వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. బౌలర్ ఇషాన్ మలింగ వేసిన ఆఖరి బంతిని బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ నేరుగా బౌలర్ వైపు ఆడాడు. ఆ బంతి ఇషాన్ మలింగ కాలికి తగిలి పక్కనే పడిపోయింది. ఈ క్రమంలో నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న కామెరూన్ గ్రీన్.. బంతి వేగాన్ని సరిగ్గా అంచనా వేయలేక పరుగు కోసం దూసుకువచ్చాడు. అంగ్క్రిష్ రఘువంశీ మొదట బంతిని గమనించక కొద్దిసేపు ఆగిపోయాడు. అప్పటికే కామెరూన్ గ్రీన్ సగం దూరం వచ్చేశాడు. కామెరూన్ గ్రీన్ వెనక్కి వెళ్లే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ ఒకే ఎండ్‌కు పరిగెత్తారు.

ట్విస్ట్ ఇచ్చిన థర్డ్ అంపైర్ నిర్ణయం
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఇషాన్ మలింగ వెంటనే బంతిని అందుకుని స్టంప్స్‌ను పడగొట్టాడు. ఇద్దరు బ్యాటర్లు ఒకే వైపు ఉండటంతో ఎవరు అవుట్ అనే గందరగోళం నెలకొంది. అంగ్క్రిష్ రఘువంశీ తాను అవుట్ అయ్యానని భావించి పెవిలియన్ వైపు వెళ్తుండగా.. ఫోర్త్ అంపైర్ అతడిని అడ్డుకున్నారు. థర్డ్ అంపైర్ రీప్లేను పరిశీలించగా.. రన్నర్లు ఒకరినొకరు క్రాస్ చేయలేదని స్పష్టమైంది. క్రికెట్ రూల్స్ ప్రకారం.. ఇద్దరు బ్యాటర్లు ఒకే ఎండ్‌లో ఉన్నప్పుడు వికెట్లకు దగ్గరగా ఉన్న బ్యాటర్‌ను మాత్రమే ఔట్‌గా పరిగణిస్తారు. ఈ సందర్భంలో కామెరూన్ గ్రీన్ వికెట్ల వైపు ఎక్కువగా ఉండటంతో అంపైర్ అతడిని అవుట్ అని ప్రకటించారు. అంగ్క్రిష్ రఘువంశీని తిరిగి క్రీజులోకి పిలిపించారు.
రూ.25 కోట్ల ఆటగాడు.. కేవలం 2 పరుగులు
ఐపీఎల్ 2026 మినీ వేలంలో కేకేఆర్ కామెరూన్ గ్రీన్‌ను రికార్డు స్థాయిలో రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ కీలక మ్యాచ్‌లో కామెరూన్ గ్రీన్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో అతను బౌలింగ్ కూడా చేయకపోవడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుతంగా రాణించి 65 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా బ్యాటర్ల మధ్య జరిగిన ఈ సమన్వయ లోపం జట్టు ఓటమికి ఒక ప్రధాన కారణమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications