Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాయర్‌కు బిగ్ షాక్.. కేకేఆర్‌లోకి ఆ స్టార్ కోచ్ రీఎంట్రీ!

ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్ వరుస పరాజయాలతో కుంగిపోతున్న నేపథ్యంలో ఆ జట్టు కోచింగ్ స్టాఫ్‌లో మార్పులపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇంగ్లాండ్ మాజీ దిగ్గజం కెవిన్ పీటర్సన్ చేసిన ఓ తాజా సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వచ్చే ఐపీఎల్ సీజన్ నాటికి ప్రస్తుత ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ మళ్లీ కేకేఆర్ గూటికి చేరుతారని కెవిన్ పీటర్సన్ జోస్యం చెప్పారు. "వచ్చే సీజన్‌లో మెకల్లమ్ కేకేఆర్ కోచ్‌గా వస్తారు.. కావాలంటే ఈ పోస్ట్‌ను బుక్‌మార్క్ చేసుకోండి" అంటూ కెవిన్ పీటర్సన్ సవాల్ విసిరారు.

అభిషేక్ నాయర్‌పై విమర్శల జడివాన
అక్టోబర్ 2025లో చంద్రకాంత్ పండిట్ స్థానంలో అభిషేక్ నాయర్‌ను కేకేఆర్ హెడ్ కోచ్‌గా నియమించారు. 2018 నుంచి జట్టుతో మెంటార్‌గా అనుబంధం ఉన్న అభిషేక్ నాయర్.. పూర్తిస్థాయి కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఈ సీజన్‌లో జట్టు దారుణంగా విఫలమైంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 ఓటములు చవిచూసిన కేకేఆర్.. కేవలం ఒక్క పాయింట్‌తో టేబుల్ అడుగున నిలిచింది. దీంతో అభిషేక్ నాయర్ వ్యూహాలపై, కోచింగ్ శైలిపై అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

IPL 2026 Brendon McCullum to Return as KKR Head Coach Kevin Pietersen Viral Claim Explained

మెకల్లమ్ తిరిగి రావడం సాధ్యమేనా?
బ్రెండన్ మెకల్లమ్ 2020 నుంచి 2022 వరకు కేకేఆర్ కోచ్‌గా పనిచేశారు. బ్రెండన్ మెకల్లమ్ హయాంలోనే 2021లో కోల్‌కతా ఫైనల్ వరకు దూసుకెళ్లింది. ఆయన ప్రవేశపెట్టిన 'బాజ్‌బాల్' జట్టుకు కొత్త ఊపిరి పోసింది. అయితే ప్రస్తుతం మెకల్లమ్ ఇంగ్లాండ్ జట్టుతో 2027 వరకు ఒప్పందంలో ఉన్నారు. ఒకవేళ పీటర్సన్ చెప్పినట్టు ఆయన ఐపీఎల్‌లోకి రావాలంటే, ఇంగ్లాండ్ కోచ్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది లేదా రెండు బాధ్యతలను నిర్వహించేలా ఈసీబీ (ECB) నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది.

కేకేఆర్ పరిస్థితి ఇలా..
ఈ సీజన్లో కేకేఆర్ ప్రయాణం అత్యంత నిరాశజనకంగా సాగుతోంది. ముంబై, హైదరాబాద్, లక్నో, చెన్నై, తాజాగా గుజరాత్ జట్ల చేతిలో చిత్తుగా ఓడిపోయింది. నెట్ రన్ రేట్ కూడా -1.149కి పడిపోవడంతో ప్లే-ఆఫ్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జట్టు యాజమాన్యం ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ మెకల్లమ్ తిరిగి వస్తే.. అది కేకేఆర్ అభిమానులకు అతిపెద్ద ఊరటనిచ్చే విషయమే అవుతుంది.

Story first published: Saturday, April 18, 2026, 12:25 [IST]
Other articles published on Apr 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+