ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ 'స్కామ్': 20 నిమిషాల్లో రూ.18 కోట్లు స్వాహా!
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ దశకు చేరింది. ఇప్పటికే లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో కేకేఆర్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సీజన్లో అజింక్యా రహానే నేతృత్వంలోని కేకేఆర్ జట్టు ప్లేఆఫ్స్ చేరడంలో పూర్తిగా విఫలమైంది. కేకేఆర్ జట్టు ఘోరంగా ఫ్లాప్ అవ్వడానికి అనేక కారణాలు ఉండగా.. అందులో ప్రధానంగా ప్లేయర్ల గాయాలు జట్టును తీవ్రంగా దెబ్బతీశాయి. మరీ ముఖ్యంగా రూ.18 కోట్ల భారీ ధర పలికిన శ్రీలంక పేసర్ మతీషా పతిరానా జట్టుకు కోలుకోలేని షాకిచ్చాడు. ఐపీఎల్ చరిత్రలోనే అతనొక పెద్ద స్కామర్‌లా మిగిలిపోయాడంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
ఈ సీజన్ వేలంలో కేకేఆర్ యాజమాన్యం మతీషా పతిరానాపై నమ్మకంతో ఏకంగా రూ.18 కోట్లు కుమ్మరించి సొంతం చేసుకుంది. అయితే సీజన్ ఆరంభం నుంచే పతిరానా గాయంతో బాధపడ్డాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి ఎన్వోసీ(NOC) తెచ్చుకోవడానికే అతనికి చాలా సమయం పట్టింది. ఆ తర్వాత లీగ్ మధ్యలో ఎట్టకేలకు కేకేఆర్ క్యాంప్‌లో చేరాడు. కొన్ని మ్యాచ్‌ల నిరీక్షణ తర్వాత పతిరానా పూర్తిగా ఫిట్‌నెస్ సాధించాడని భావించి గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యాజమాన్యం అతన్ని బరిలోకి దించింది.

కానీ కేకేఆర్ దురదృష్టం కొద్దీ.. ఆ మ్యాచ్‌లో మతీషా పతిరానా కేవలం 8 బంతులు మాత్రమే వేయగలిగాడు. ఆ వెంటనే పతిరానాకు హ్యామ్ స్ట్రింగ్ గాయం తిరగబెట్టడంతో తీవ్ర నొప్పితో మైదానాన్ని వీడాడు. మొత్తంగా చూసుకుంటే ఈ సీజన్ మొత్తంలో పతిరానా కనీసం 20 నిమిషాలు కూడా స్టేడియంలో సరిగ్గా లేడు. కేవలం 8 బంతులు వేసి రూ.18 కోట్లు జేబులో వేసుకుని టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో కేకేఆర్ పెట్టిన భారీ పెట్టుబడి కాస్తా గంగలో పోసిన పన్నీరైంది.
నిజానికి కేకేఆర్ జట్టు ఈ ఐపీఎల్ 2026 సీజన్ మొదటి నుంచీ అస్సలు కలిసిరాలేదు. బంగ్లాదేశ్ లో అంతర్గత గొడవల కారణంగా రూ.9 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కేకేఆర్ విడుదల చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సీజన్ ప్రారంభానికి ముందే స్టార్ బౌలర్ హర్షిత్ రాణా గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇక సగం సీజన్ అయిపోయాక వచ్చిన పతిరానా కూడా ఇలా 8 బంతులకే గాయపడటంతో కేకేఆర్ బౌలింగ్ విభాగం పూర్తిగా బలహీనపడింది.
జట్టులో వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి వంటి యువ పేసర్లు ఉన్నంతలో బాగానే శ్రమించినప్పటికీ.. కీలక సమయాల్లో అనుభవజ్ఞులైన బౌలర్లు లేకపోవడం కేకేఆర్‌ను ముంచేసింది. ఈ బలహీనతల వల్లే కేకేఆర్ ఈ సీజన్లో ఆడిన 14 లీగ్ మ్యాచ్‌లలో కేవలం 6 మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించి, ప్లేఆఫ్స్ రేసు నుంచి అత్యంత నిరాశజనకంగా నిష్క్రమించింది. రూ.18 కోట్లు తీసుకుని కనీసం రెండు ఓవర్లు కూడా వేయకుండా చేతులెత్తేసిన పతిరానాపై కేకేఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications