Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బీసీసీఐ కన్నెర్ర.. చిక్కుల్లో పడ్డ ఢిల్లీ స్టార్!

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కివీస్ పేసర్ కైల్ జేమీసన్ ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసిన తర్వాత జేమీసన్ అత్యంత దూకుడుగా వ్యవహరించాడు. వికెట్ తీసిన ఆనందంలో ఆ కుర్రాడికి దగ్గరగా వెళ్లి విరుచుకుపడుతూ సెండాఫ్ ఇచ్చాడు. ఓ సీనియర్ అంతర్జాతీయ బౌలర్, కెరీర్ ఇప్పుడే మొదలుపెట్టిన చిన్న పిల్లాడితో ఇలా ప్రవర్తించడం క్రికెట్ అభిమానులను, నెటిజన్లను ఆగ్రహానికి గురిచేసింది.

రంగంలోకి దిగిన బీసీసీఐ
సోషల్ మీడియాలో ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో బీసీసీఐ వెంటనే స్పందించింది. జేమీసన్ ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన బోర్డు.. అతనికి ఓ డీమెరిట్ పాయింట్‌ను విధించడంతో పాటు తీవ్రంగా హెచ్చరించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5ను జేమీసన్ ఉల్లంఘించినట్లు మ్యాచ్ రిఫరీ నిర్ధారించారు. ప్రత్యర్థి ఆటగాడిని కించపరిచేలా లేదా రెచ్చగొట్టేలా వ్యవహరించినందుకు ఈ శిక్ష విధించారు. జేమీసన్ కూడా తన తప్పును అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ రాజీవ్ సేథ్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.

IPL 2026 BCCI Punishes Kyle Jamieson with Demerit Point for Aggression Against Vaibhav Sooryavanshi

ఆర్టికల్ 2.5 అంటే ఏమిటి?
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ఆర్టికల్ 2.5 అనేది ఓ ఆటగాడిని ఔట్ చేసిన తర్వాత అతడిని కించపరిచేలా సైగలు చేయడం, అనవసరమైన మాటలు అనడం లేదా రెచ్చగొట్టేలా ప్రవర్తించడం వంటి అంశాలకు వర్తిస్తుంది. రాజస్థాన్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లో వైభవ్ వికెట్ తీసిన తర్వాత జేమీసన్ ఆ కుర్రాడి ముఖానికి అత్యంత దగ్గరగా వెళ్లి దూకుడు ప్రదర్శించిన తీరు, బ్యాటర్‌ను ఆగ్రహానికి గురిచేసేలా ఉందని అధికారులు భావించారు. లెవెల్-1 నిబంధనల కింద ఈ చర్యలు తీసుకున్నట్లు ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది.

మ్యాచ్ పరిస్థితి ఇలా..
ఈ వివాదం పక్కన పెడితే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై ఘనవిజయం సాధించింది. తద్వారా ఈ సీజన్లో ఢిల్లీ తన నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 225 పరుగులు చేసినప్పటికీ.. ఢిల్లీ బ్యాటర్ల ధాటికి ఆ లక్ష్యం సరిపోలేదు. అయితే జేమీసన్ తీసిన వైభవ్ వికెట్ మ్యాచ్ ఆరంభంలో కీలకంగా మారినప్పటికీ.. ఆ తర్వాత అతను ప్రదర్శించిన దూకుడు వల్ల ఇప్పుడు జరిమానా ఎదుర్కోవాల్సి వచ్చింది.

Story first published: Saturday, May 2, 2026, 10:59 [IST]
Other articles published on May 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+