For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: ఐపీఎల్ వేలంలో ఈ నయా రూల్ తెలుసా?

IPL 2026: ఐపీఎల్ మినీ వేలం సందర్భంగా బీసీసీఐ ఓ కొత్త 'టై-బ్రేకర్' నియమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త రూల్ క్రికెట్ అభిమానులలో ఉత్సాహాన్ని పెంచే అవకాశం ఉంది. ఒకే ఆటగాడి కోసం రెండు లేదా అంతకంటే ఎక్కువ జట్లు ఒకే బిడ్‌పై నిలిచిపోయినప్పుడు, ఈ నియమం అమలులోకి వస్తుంది.

'టై-బ్రేకర్' రూల్ ఎప్పుడు అవసరమంటే?
గతంలో కీరన్ పొలార్డ్(2010), రవీంద్ర జడేజా(2012) వంటి ఆటగాళ్లను పెద్ద బిడ్డింగ్ యుద్ధాల అనంతరం రహస్య బిడ్ ద్వారా జట్లు తమ సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఆ తరహా క్లిష్టమైన హై-లెవెల్ టైలను పరిష్కరించడానికి ఈ కొత్త రూల్ రూపొందించబడింది. ఐపీఎల్ 2026 మినీ వేలంలో కొనుగోలు చేసేందుకు కేవలం కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల వద్ద మాత్రమే ఎక్కువ డబ్బు(పర్స్‌లో బ్యాలెన్స్) ఉంది. మిగిలిన 7 జట్ల పర్స్ బ్యాలెన్స్ ఒకదానికొకటి దగ్గరగా ఉంది. ఈ కారణంగా ఆస్ట్రేలియాకు చెందిన కామెరాన్ గ్రీన్, ఇంగ్లాండ్‌కు చెందిన లియామ్ లివింగ్‌స్టోన్ వంటి స్టార్ విదేశీ ఆటగాళ్ల కోసం గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ కేవలం రూ. 2.75 కోట్ల పర్స్‌తో ఈ బిడ్డింగ్‌లో పాల్గొనడం కష్టం.

IPL 2026 Auction New Tie-Breaker Rule Explained for Mini Auction

కొత్త టై-బ్రేకర్ రూల్ ఏమిటి?
ఒకే బిడ్‌పై రెండు లేదా అంతకంటే ఎక్కువ జట్లు నిలిచిపోయినప్పుడు సమస్యను పరిష్కరించడానికి బీసీసీఐ(BCCI) అందించిన సరళమైన పరిష్కారం ఇది. ఒకే బిడ్‌పై జట్లు లాక్ అయినప్పుడు, బోర్డు వారికి ఒక 'టై-బ్రేకర్ ఫామ్' అందిస్తుంది. ఈ ఫామ్‌లో ఫ్రాంచైజీలు భారతీయ రూపాయల్లో ఒక 'రహస్య బిడ్' మొత్తాన్ని రాయాల్సి ఉంటుంది. ఈ 'రహస్య బిడ్' మొత్తాన్ని మాత్రం ఆటగాడికి చెల్లించరు. ఇది BCCIకి చెల్లించాల్సిన మొత్తం. అందుకే దీనిని ఇప్పటికీ 'టై-బ్రేకర్ బిడ్' అని పిలుస్తారు.రహస్య బిడ్‌లో అత్యధిక మొత్తం రాసిన జట్టు ఆ ఆటగాడిని గెలుచుకుంటుంది. విజేత జట్టు ఆ 'రహస్య బిడ్' మొత్తాన్ని డిసెంబర్ 16 వేలం తేదీ నుండి 30 రోజులలోపు భారతీయ రూపాయలలో BCCIకి చెల్లించాల్సి ఉంటుంది.

ఆటగాడి ధర ఎంత ఉంటుంది?
కీలక విషయమేమిటంటే.. ఈ ప్రక్రియలో ఆటగాడి తుది ధర మాత్రం మారదు. ఆటగాడికి చెల్లించాల్సిన ధర, రెండు జట్లు ఏ బిడ్‌పై అయితే లాక్ అయ్యాయో (చివరిగా నిర్ణయించిన వేలం మొత్తం) అదే ఉంటుంది. గెలిచిన రహస్య బిడ్ మొత్తం కేవలం టై-బ్రేక్ కోసం ఉపయోగించబడుతుంది మరియు BCCIకి అదనపు ఆదాయంగా వెళ్తుంది.

Story first published: Monday, December 15, 2025, 15:49 [IST]
Other articles published on Dec 15, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+