Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: 1000 మంది ఔట్! కేవలం వారికే ఐపీఎల్ వేలం ఛాన్స్

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఆటగాళ్ల మినీ-వేలం డిసెంబర్ 16న అబుదాబిలో జరగనుంది. ఈ వేలంలో పాల్గొనడానికి మొదట 1355 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే ఫ్రాంచైజీలతో సుదీర్ఘ చర్చల తర్వాత బీసీసీఐ తుది జాబితాను కేవలం 350 మందికి మాత్రమే పరిమితం చేసింది. అంటే వేలానికి ముందే దాదాపు 1000 మంది ఆటగాళ్లు జాబితా నుంచి తొలగించబడ్డారు. ఈ తుది జాబితాలో ఆరంభ స్ప్రెడ్‌షీట్‌లో లేని 35 కొత్త పేర్లు కూడా చేరడం విశేషం. ఈ సర్‌ప్రైజ్ ఎంట్రీలలో అత్యంత ఆశ్చర్యకరమైన పేరు.. దక్షిణాఫ్రికా వికెట్ కీపర్- బ్యాటర్ క్వింటన్ డి కాక్!

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత సర్‌ప్రైజ్ ఎంట్రీ
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి మళ్లీ వెనక్కి వచ్చారు. గత ఐపీఎల్ సీజన్‌లో మెరుగ్గా ఆడకపోవడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఆయనను రిలీజ్ చేసింది. అయితే ఫ్రాంచైజీల అభ్యర్థన మేరకు డి కాక్ పేరును వేలంలో చేర్చారు.

బేస్ ప్రైస్: రూ. 1 కోటి (గత సీజన్‌లో ఉన్న ధరలో సగం). డికాక్ పేరు మూడో లాట్‌లో రానుంది.

IPL 2026 Auction Nearly 1000 Players Dropped Only 350 Shortlisted

ఎవరు ముందు? కామెరాన్ గ్రీన్ కోసం భారీ డిమాండ్
ఐపీఎల్ మినీ వేలం స్పెషలైజేషన్ క్రమంలో మొదలవుతుంది. ముందుగా క్యాప్డ్ ప్లేయర్స్ (అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు) రౌండ్‌లో బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు, వికెట్ కీపర్లు, ఫాస్ట్ బౌలర్లు, ఆపై స్పిన్నర్ల పేర్లు వస్తాయి. ఆ తర్వాత అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ (అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడని ఆటగాళ్లు) రౌండ్ మొదలవుతుంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ కోసం ఫ్రాంచైజీల నుంచి భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉంది.

మొదటి లాట్ (బ్యాట్స్‌మెన్): గ్రీన్, డెవాన్ కాన్వే, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా, డేవిడ్ మిల్లర్ వంటి పేర్లు ఈ గ్రూప్‌లో ఉన్నాయి.

ఆల్‌రౌండర్స్ లాట్: వెంకటేష్ అయ్యర్ పేరు ఈ లాట్‌లో చేర్చబడింది.

యాక్సిలరేటెడ్ రౌండ్
ప్రతి వేలంలో లాగే ఈసారి కూడా యాక్సిలరేటెడ్ రౌండ్ ఉంటుంది. మొదటి 70 మంది ఆటగాళ్లపై బిడ్డింగ్ పూర్తయ్యాక, 71వ పేరు నుంచి 350వ పేరు వరకు యాక్సిలరేటెడ్ రౌండ్ మొదలవుతుంది. ఆ తర్వాత కూడా అమ్ముడుపోని ఆటగాళ్లలో నుంచి తమకు నచ్చిన పేర్లను ఫ్రాంచైజీలు ఇవ్వవచ్చు. ఆ పేర్లపై మళ్లీ బిడ్డింగ్ (వేలం) జరుగుతుంది.

Story first published: Tuesday, December 9, 2025, 10:16 [IST]
Other articles published on Dec 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+