Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాత్రికి రాత్రే స్టార్‌.. అర్జున్ టెండూల్కర్ జోస్యం నిజమైంది! (వీడియో)

ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ యువ ప్లేయర్ ముకుల్ చౌదరి కేకేఆర్ పై అద్భుత ఇన్నింగ్స్ ఆడి రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయాడు. అయితే ముకుల్ చౌదరి ప్రతిభను ప్రపంచం గుర్తించడానికంటే ముందే అర్జున్ టెండూల్కర్ పసిగట్టాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న అర్జున్ టెండూల్కర్.. నెట్స్‌లో ముకుల్ సిక్స్ కొట్టే సామర్థ్యం చూసి తాను ఆశ్చర్యపోయానని.. ముకుల్ గ్రౌండ్ నలుమూలలా సిక్సర్లు బాదగలడని అప్పుడు చెప్పాడు. ఇప్పుడు ముకుల్ చౌదరి హీరోగా మారడంతో ఆ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ముకుల్ చౌదరి విధ్వంసం.. కేకేఆర్ చిత్తు
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ముకుల్ చౌదరి వీరవిహారం చేశాడు. కేవలం 7 సిక్సర్లతో అజేయంగా 54 పరుగులు చేసి, ఓడిపోతుందనుకున్న లక్నో జట్టును గెలిపించాడు. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీ స్టైల్‌లో అతను కొట్టిన 'హెలికాప్టర్ షాట్' మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. చివరి ఓవర్‌లో 14 పరుగులు అవసరమైన తరుణంలో వైభవ్ అరోరా బౌలింగ్‌లో ఐదో బంతికి సిక్స్ కొట్టి స్కోరు సమం చేశాడు. ఆఖరి బంతికి సింగిల్ తీసి లక్నోకు అపురూప విజయాన్ని అందించాడు.

IPL 2026 Arjun Tendulkar Prediction Comes True as Mukul Choudhary Smashes KKR Full Details

ముంబై నుంచి లక్నోకు మారిన అర్జున్ టెండూల్కర్
అర్జున్ టెండూల్కర్ గతంలో ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నప్పటికీ.. ఈ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ అతడిని కొనుగోలు చేసింది. అర్జున్ టెండూల్కర్ ఓ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ఇంకా లక్నో తరఫున అరంగేట్రం చేసే అవకాశం రాకపోయినప్పటికీ.. నెట్స్ ప్రాక్టీస్‌లో తన సహచర ఆటగాడు ముకుల్ చౌదరి సామర్థ్యాన్ని పసిగట్టి అర్జున్ టెండూల్కర్ ప్రశంసించడం విశేషం. పాయింట్, స్క్వేర్ లెగ్, అప్పర్ కట్.. ఇలా ముకుల్ చౌదరి అన్ని రకాల షాట్లు ఆడగలడని అర్జున్ టెండూల్కర్ కొనియాడాడు.

కేకేఆర్ కష్టాలు.. గ్రీన్ వైఫల్యం
ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కామెరూన్ గ్రీన్ తన రెండో బంతికే రిషబ్ పంత్‌ను ఔట్ చేసి శుభారంభం ఇచ్చినప్పటికీ.. చివరి ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. చివరి రెండు ఓవర్లలో లక్నోకు 30 పరుగులు అవసరమవ్వగా.. గ్రీన్ తన ఓవర్లో 16 పరుగులు సమర్పించుకున్నాడు. దీనికి తోడు ముకుల్ చౌదరి మెరుపులు తోడవ్వడంతో కేకేఆర్‌కు మరో ఓటమి తప్పలేదు. ఇదిలా ఉండగా.. రూ.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసి కామెరూన్ గ్రీన్ ఘోరంగా విఫలమయ్యాడని.. రూ.2.60 కోట్లు పెట్టి లక్నో కొనుగోలు చేసిన ముకుల్ సూపర్ హీరో అయ్యాడని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

నెరవేరిన ముకుల్ తండ్రి కల
ముకుల్ చౌదరి ఈ స్థాయికి రావడం వెనుక అతని తండ్రి పట్టుదల ఎంతో ఉంది. ముకుల్ చౌదరి పుట్టకముందే అతన్ని క్రికెటర్‌ను చేయాలని ఆయన కలలు కన్నారు. 21 ఏళ్ల ఈ యువ సూపర్ స్టార్ తన మూడో ఐపీఎల్ మ్యాచ్‌లోనే ఏ భారతీయ అన్‌క్యాప్డ్ ప్లేయర్ సాధించని రీతిలో రికార్డులు సృష్టించి తన తండ్రి కలను నిజం చేశాడు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ కొత్త 'సిక్సర్ కింగ్' గురించి చర్చించుకుంటోంది.

Story first published: Friday, April 10, 2026, 10:11 [IST]
Other articles published on Apr 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+