రాకా లుక్.. అఖీల్ కిక్: తెలుగు హీరో లుక్‌ను దించేశాడుగా!
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో సీఎస్కే స్టార్ స్పిన్నర్ అఖీల్ హుస్సేన్ తన బౌలింగ్‌తోనే కాకుండా తన విభిన్నమైన సెలబ్రేషన్ స్టైల్‌తో అభిమానులను మెప్పించాడు. సాధారణంగా విండీస్ ఆటగాళ్లు మైదానంలో చూపించే ఉత్సాహం, వారి విలక్షణమైన శైలి క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేకంగా ఉంటుంది. తాజాగా సీఎస్కే తరపున ఆడుతున్న అఖీల్ హుస్సేన్, ముంబై బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతూ చేసిన 'మాస్క్' సెలబ్రేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ మ్యాచ్‌లో 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ప్రారంభంలోనే అఖీల్ హుస్సేన్ షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ ఆఖరి బంతికి డానిష్ మాలేవర్‌ను డకౌట్ చేసిన అఖీల్ హుస్సేన్.. ఆ తర్వాతి ఓవర్లో నమన్ ధీర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. వికెట్ తీసిన ఆనందంలో తన ముఖాన్ని చేతితో కప్పుకుంటూ 'మాస్క్' వేసుకున్నట్లుగా ఆయన చేసిన సెలబ్రేషన్ హైలైట్‌గా నిలిచింది. దీనికి తోడు వికెట్ కీపర్ సంజూ శాంసన్ కూడా తన హెల్మెట్, గ్లోవ్స్‌తో అదే తరహాలో అఖీల్‌ను అనుకరించడం స్టేడియంలో నవ్వులు పూయించింది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన ఫోటో నెటిజన్ల దృష్టిని విపరితంగా ఆకర్షిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్నట్లు ప్రచారంలో ఉన్న "రాకా" చిత్రానికి సంబంధించిన అదిరిపోయే లుక్ కాగా.. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ అఖీల్ హుస్సేన్ సెలబ్రేషన్ ఫోటో ఉంది. ఈ రెండింటిలోనూ ఉన్న ఒకే రకమైన 'మాస్క్' పోజ్ ఇప్పుడు సినీ, క్రికెట్ అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది.ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ స్పిన్నర్ అఖీల్ హుస్సేన్ సరిగ్గా ఇదే తరహాలో సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. వికెట్ తీసిన ఆనందంలో తన ముఖాన్ని చేతితో కప్పుకుంటూ 'మాస్క్' వేసుకున్నట్లుగా ఆయన చేసిన ఈ విలక్షణమైన సెలబ్రేషన్ స్టేడియంలో అందరినీ ఆశ్చర్యపరిచింది. విండీస్ ఆటగాళ్ల సహజసిద్ధమైన స్వాగ్, అల్లు అర్జున్ సినిమాటిక్ గ్రేస్ ఒకేలా ఉండటంతో, "అఖీల్ హుస్సేన్ ఈ మాస్క్ సెలబ్రేషన్‌ను బన్నీ నుంచి స్ఫూర్తి పొంది చేశారా?" అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి వెండితెరపై ఐకాన్ స్టార్ చూపిస్తున్న మాస్ జాతర, క్రికెట్ మైదానంలో అఖీల్ హుస్సేన్ చేస్తున్న వికెట్ల వేట.. ఈ రెండింటి కలయిక సోషల్ మీడియాలో ఓ క్రేజీ ట్రెండ్‌ను సృష్టించింది. ఒకే రకమైన మేనరిజంతో ఇద్దరు సెలబ్రిటీలు వేర్వేరు రంగాల్లో సంచలనం సృష్టించడం అభిమానులకు కన్నుల పండుగగా ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్ "రాకా" లుక్ పక్కాగా అఖీల్ సెలబ్రేషన్‌కు మ్యాచ్ అవ్వడం ఈ ఫోటోను మరింత వైరల్ చేస్తోంది.
అఖీల్ హుస్సేన్ ఇంతటితో ఆగకుండా, ప్రమాదకరమైన తిలక్ వర్మను క్లీన్ బౌల్డ్ చేసి ముంబై ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ వికెట్ తీసిన తర్వాత తన వేళ్లతో వికెట్ల సంఖ్యను లెక్కపెడుతూ మరో వెరైటీ సెలబ్రేషన్ చేశాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్‌ను కూడా పెవిలియన్ చేర్చడంతో, అఖీల్ తన 4 ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. సంజు శాంసన్ మెరుపు సెంచరీ, అఖీల్ హుస్సేన్ అద్భుత బౌలింగ్‌తో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌పై ఘనవిజయం సాధించి పాయింట్ల పట్టికలో దూసుకుపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications