ఆ ముగ్గురి వల్లే ఈ విజయం సాధ్యమైంది: అజింక్య రహానే
బుధవారం ముంబై ఇండియన్స్ జట్టుపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన కేకేఆర్ ప్లేఆఫ్స్ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. గత 7 మ్యాచ్‌ల్లో కేకేఆర్‌కు ఇది 6వ విజయం కావడం విశేషం. ఈ సక్సెస్ క్రెడిట్ అంతా జట్టు సపోర్ట్ స్టాఫ్‌కే దక్కుతుందని కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు. వరుస ఓటములతో జట్టు డీలా పడిన సమయంలో కోచ్, ఇతర సపోర్ట్ స్టాఫ్ ప్లేయర్లలో మానసిక ధైర్యాన్ని నింపారని రహానే కొనియాడాడు. ఈ సీజన్ ఆరంభంలో కేకేఆర్ ప్రదర్శన అత్యంత ఘోరంగా సాగింది. మొదటి 6 మ్యాచ్‌ల్లో జట్టుకు ఒక్క విజయం కూడా దక్కలేదు. 5 మ్యాచ్‌ల్లో ఓడిపోగా.. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి కేకేఆర్ జట్టు కోలుకున్న తీరు అమోఘం.
ముంబైపై కేకేఆర్ విజయం సాధించిన అనంతరం అజింక్య రహానే మాట్లాడుతూ.. "మొదటి 6 మ్యాచ్‌ల తర్వాత కూడా మాపై మాకున్న నమ్మకమే ఈ అద్భుతమైన విజయానికి కారణం. మేమంతా కూర్చొని ఓపెన్‌గా మాట్లాడుకున్నాం. మేము మంచి క్రికెట్ ఆడుతున్నప్పటికీ.. కీలక సమయాల్లో మ్యాచ్‌లను గెలవడం టీ20 ఫార్మాట్లో ఎంతో ముఖ్యం. 6 మ్యాచ్‌లు ఓడిపోయాక బ్రేక్ తీసుకున్నప్పుడు జట్టులో వాతావరణం చాలా భారంగా ఉంటుంది. కానీ మా సపోర్ట్ స్టాఫ్ జట్టులో సానుకూల వాతావరణానని నింపారు. అందుకే ఈ సక్సెస్ క్రెడిట్ అంతా వారికే దక్కుతుంది" అని అజింక్య రహానే భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ బౌలింగ్‌ను మెచ్చుకుంటూనే.. యువ ప్లేయర్లు అనుకుల్ రాయ్, కార్తీక్ త్యాగిల ప్రదర్శనను అజింక్య రహానే ప్రత్యేకంగా అభినందించాడు. డొమెస్టిక్ సీజన్‌లో అద్భుతంగా రాణించి అదే నమ్మకంతో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన వీరిద్దరూ.. ఒత్తిడితో కూడుకున్న సమయాల్లో బాధ్యతాయుతంగా బౌలింగ్ చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని కెప్టెన్ అజింక్య రహానే కొనియాడాడు.
ఇక ముంబై ఇండియన్స్‌పై 33 బంతుల్లో 6 ఫోర్ల సహాయంతో 45 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడిన సీనియర్ బ్యాటర్ మనీష్ పాండేపై రహానే దిల్ గెలిచే కామెంట్స్ చేశాడు. "మనీష్ పాండే ప్రదర్శన పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. జట్టులో అవకాశం రానప్పుడు కూడా అతను నెట్స్‌లో కష్టపడిన తీరు, అతని సానుకూల దృక్పథం అద్భుతం. తుది జట్టులో చోటు దక్కనప్పుడు మానసికంగా బలంగా ఉంటూ బ్యాటింగ్, ఫీల్డింగ్‌పై కఠినంగా శ్రమించడం ఓ ఆటగాడిగా చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో మనీష్ చూపించిన టీమ్ మైండ్‌సెట్ జట్టుకు ఎంతో అవసరం. ఈ మ్యాచ్‌లో అతను ఆడిన ఇన్నింగ్స్ జట్టుకు ప్రాణం పోసింది" అంటూ రహానే మనీష్ పాండేపై ప్రశంసల జల్లు కురిపించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications