గెలిచినా తప్పని జరిమానా.. అభిషేక్ శర్మకు ఊహించని షాక్!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 65 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి ఈ సీజన్‌లో తమ మొదటి బోణీని నమోదు చేసింది. అయితే జట్టు గెలిచిన ఆనందంలో ఉన్న యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గట్టి షాక్ ఇచ్చింది. మైదానంలో నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను అతనికి జరిమానా విధించింది.
మ్యాచ్ ఫీజులో కోత
ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత అభిషేక్ శర్మ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు తేలింది. దీనికి శిక్షగా అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా అభిషేక్ ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చారు. ఐపీఎల్ నిబంధనలలోని ఆర్టికల్ 2.3 కింద లెవెల్ 1 నేరానికి పాల్పడినట్లు అభిషేక్ శర్మ అంగీకరించాడు. మ్యాచ్ రిఫరీ విధించిన ఈ శిక్షను అభిషేక్ శర్మ స్వీకరించడంతో తదుపరి విచారణ అవసరం లేకుండా పోయింది.

ఎందుకు ఈ జరిమానా?
అభిషేక్ శర్మ ఏ కారణంతో శిక్షకు గురయ్యారనే విషయాన్ని ఐపీఎల్ తన అధికారిక ప్రకటనలో స్పష్టంగా పేర్కొనలేదు. అయితే ఆర్టికల్ 2.3 అనేది సాధారణంగా మ్యాచ్ జరగుతున్న సమయంలో అనుచిత భాషను ఉపయోగించడం లేదా అసభ్య పదజాలం వాడటం వంటి అంశాలకు సంబంధించింది. మైదానంలో వికెట్ పడినప్పుడు లేదా ఉద్వేగభరిత క్షణాల్లో ఆవేశానికి లోనై మాట్లాడిన మాటలే ఈ జరిమానాకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.
బ్యాటింగ్‌తో అదరగొట్టిన అభిషేక్ శర్మ
ఓ వైపు జరిమానా పడినా.. మరోవైపు అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 21 బంతుల్లో 48 పరుగులు చేసి సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇందులో 4 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే అభిషేక్ ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున డేవిడ్ వార్నర్ తర్వాత 100 సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా అభిషేక్ శర్మ(మొత్తం 101 సిక్సర్లు) రికార్డు సృష్టించాడు. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 227 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక కేకేఆర్ 16 ఓవర్లలోనే 161 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications