For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: ప్రీతి జింటాను ముంచేసిన చాహల్ !

IPL 2025: ఐపీఎల్ 2025 వేలంలో యుజ్వేంద్ర చాహల్ కోసం పంజాబ్ కింగ్స్ కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. రూ.18 కోట్ల భారీ ధరకు పంజాబ్ జట్టులో చేరిన యుజ్వేంద్ర చాహల్ ఇప్పటివరకు మొత్తం సీజన్‌లో అంత గొప్పగా ఏమీ రాణించలేకపోయాడు. అటువంటి పరిస్థితిలో ఇఫ్పుడు చాహల్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఐపీఎల్ సీజన్ జరిగిన ప్రతి మ్యాచ్‌లోనూ చాలా ప్రదర్శన ఇచ్చాడు. యుజ్వేంద్ర చాహల్ చాలా పరుగులు ఇవ్వడమే కాకుండా వికెట్లు కూడా పడటం లేదు. అటువంటి పరిస్థితిలో ఐపీఎల్‌లో చాహల్ అభిమానులను నిరాశపరుస్తున్నాడు.

ఈ ఐపీఎల్ సీజన్‌లో యుజ్వేంద్ర చాహల్ ప్రదర్శన అంతగా ఏమీ లేదు. రూ.18 కోట్ల రూపాయల భారీ ధర కారణంగా చాహల్ అందరి దృష్టిలో ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అయిన చాహల్.. తన కొత్త జట్టు పంజాబ్ కింగ్స్ తరపు గత సీజన్ లాగా రాణించలేకపోయాడు. ఈ లెగ్ స్పిన్నర్ ఈ సీజన్ లో 5 మ్యాచ్‌ల్లో కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. యుజ్వేంద్ర చాహల్ ఎకానమీ రేటు 11.13, ఇది పంజాబ్ కు ఆందోళన కలిగించే విషయం.

IPL 2025 Yuzvendra Chahal Disappoints Preity Zinta with Poor Performance

హైదరాబాద్‌పై కూడా ఎదురుదెబ్బ
శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో చాహల్ ప్రదర్శన నిరాశపరిచింది. చాహల్ తన 4 ఓవర్ల స్పెల్ లో చాలా పరుగులు ఇచ్చాడు. చాహల్ ట్రావిస్ హెడ్ వికెట్ తీసుకున్నాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. చాహల్ 56 పరుగులు కూడా ఇచ్చాడు. భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ చాహల్ బౌలింగ్ ను విమర్శిస్తూ... చాహల్ మనస్తత్వం చాలా రక్షణాత్మకంగా ఉందని.. దాని కారణంగా అతని ముఖంపై ఒత్తిడి కనిపిస్తోందని అన్నారు. దీని అర్థం చాహల్ దూకుడుగా బౌలింగ్ చేయడానికి బదులుగా పరుగులను ఆపడంపై దృష్టి పెడుతున్నాడని.. అందుకు బ్యాటర్లపై ఒత్తిడి ఏర్పడటం లేదన్నాడు.

అదే సమయంలో భారత స్పిన్నర్ పీయూష్ చావ్లా మాట్లాడుతూ.. ఈ సీజన్ లో చాహల్ ఎక్కువ గూగ్లీలను బౌలింగ్ చేయడం లేదని, అందువల్ల వికెట్లు తీసే అవకాశాలు తగ్గాయని అన్నారు. బహుశా ఈ సీజన్ ను పరిశీలిస్తే చాహల్ ఫామ్ లేడని అనిపిస్తోందన్నారు. శనివారం అభిషేక్ శర్మ 55 బంతుల్లో 141 పరుగులు చేయడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 246 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఇది ఐపీఎల్ లో రెండవ అత్యధిక పరుగుల ఛేదన కావడం గమనార్హం.

Story first published: Sunday, April 13, 2025, 20:07 [IST]
Other articles published on Apr 13, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+