టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఓ ఫారెన్ అమ్మాయితో అతడు డేటింగ్ చేస్తున్నట్లు గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తోన్న అతడు.. తాజాగా తమ జట్టు మ్యాచు ఉన్న సమయంలో గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి చిల్ కొడుతూ సోషల్ మీడియా చేతికి చిక్కాడు. ఈ ఫొటోలో యశస్వి జైశ్వాల్, తన రూమర్ గర్ల్ ఫ్రెండ్ మాడీ హామిల్టన్‌తో పాటు ఆమె సోదరుడు కూడా ఇందులో కనిపించాడు. ఈ ఫొటోను జైశ్వాలే తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు.
ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే?
ఇంగ్లాండ్ కు చెందిన మాడీ హామిల్టన్‌తో యశస్వి జైస్వాల్ గత మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్నాడని సమచారం. ఐపీఎల్ 2024 సమయంలోనూ చెన్నై విమానాశ్రయంలో ఈ ఇద్దరూ కలిసి కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. మాడీ.. ఐపీఎల్‌తో పాటు జైశ్వాల్ ఆడిన పలు అంతర్జాతీయ మ్యాచ్‌లకు కూడా హాజరై సందడి చేసింది. వీరిద్దరూ కలిసి చాలా సార్లు పలు చోట్ల కెమెరా కంటికి దర్శనమిచ్చారు.

అలా మొదలైన ప్రేమ...!
ఇంగ్లాండ్‌కు చెందిన హెన్రీ.. జైశ్వాల్‌కు మంచి ఫ్రెండ్. అతడి సోదరే మాడ్డీ హామిల్టన్. హామిల్టన్ ప్రస్తుతం చుదువుకున్నట్లు సమాచారం. ఇంగ్లాండ్‌కు వెళ్లిన ప్రతీసారి జైస్వాల్.. హెన్రీ ఇంటికి వెళ్తాంటాడు. ఆ కుటుంబంతో జైశ్వాల్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలోనే మాడ్డీ హామిల్టన్‌తో అయిన పరిచయం కాస్త ప్రేమగా మారినట్లు సమాచారం. భవిష్యత్తులో ఈ ఇద్దరూ మరి పెళ్లి చేసుకుంటారో లేదో..
కాగా, యశస్వి జైశ్వాల్ ఈ ఐపీఎల్ సీజన్ లో ఆశించిన స్థాయిలో ఇంకా ప్రదర్శన చేయట్లేదు. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచుల్లో 1, 29, 4 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ ఈ ఐపీఎల్ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లో ఒకటి గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది.