For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: ఇది జరిగితే.. విరాట్ కోహ్లీ కూడా ఐపీఎల్ నుంచి రిటైర్ కావచ్చు!

IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పంజాబ్ కింగ్స్‌తో క్వాలిఫయర్ 1 ఆడబోతోంది. ఇప్పటివరకు క్వాలిఫయర్-1 ఆడినప్పుడల్లా ఆర్సీబీ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆర్సీబీ ఫైనల్ చేరుకునే అవకాశం కూడా ఉంది. మరోవైపు ఆర్సీబీ జట్టులోని అత్యంత సీనియర్, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రదర్శన కూడా ఈ సీజన్‌లో అద్బుతంగా ఉంది. ఇప్పటివరకు ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆర్సీబీ కెప్టెన్ కాదు కానీ ఆటగాళ్లకు ముందుండి మార్గనిర్దేశం చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

విరాట్ కోహ్లీ ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతాడా?
అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ టీ20, టెస్ట్ ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యాడు. విరాట్ కోహ్లీ ఇంకా వన్డే క్రికెట్‌లో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో ప్రతిదీ సాధించాడు. కానీ విరాట్ తన 18 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లో ఎప్పుడూ ట్రోఫీని గెలవలేకపోయాడు. విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో 18 ఏళ్లుగా ఆర్సీబీ తరఫున ఆడుతున్నాడు. అదే సమయంలో విరాట్ కోహ్లీ చాలా ఏళ్లుగా జట్టుకు నాయకత్వం వహించాడు. కానీ ఇప్పటివరకు ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకోలేదు. ఈ సారి ఐపీఎల్ 2025లో ఆర్సీబీ జట్టు ఆడుతున్న విధానం, విరాట్ కోహ్లీ ప్రదర్శ చూస్తే ఆ జట్టు ట్రోఫీని గెలుచుకోవడానికి బలమైన పోటీదారుగా పరిగణించబడుతోంది.

IPL 2025 Will Virat Kohli Retire If RCB Wins the Title

ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఐపీఎల్ 2025 టైటిల్‌ను గెలిస్తే విరాట్ కోహ్లీ ఐపీఎల్ నుంచి కూడా రిటైర్ అయ్యే అవకాశం ఉంది. అభిమానులు, విరాట్ కోహ్లీ కూడా చాలా కాలంగా ఆర్సీబీ జట్టు మొదటి ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఆర్సీబీ జట్టు ఐపీఎల్ పైనల్‌కు చేరుకుంది. కానీ ఎప్పుడూ గెలవలేదు. ఆర్సీబీ 2016లో చివరిసారిగా ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని ఆర్సీబీ సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.

కెరీర్‌లో ఇవన్నీ సాధించిన విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకున్నాడు. 2011 వన్డే ప్రపంచ కప్ సమయంలో విరాట్ కోహ్లీ టీమిండియాలో భాగంగా ఉన్నాడు. టీమిండియా ఎంఎస్ ధోని కెప్టెన్సీలో ఈ టైటిల్ ను గెలుచుకుంది. దీనితో పాటు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా చాలా కాలం పాటు టెస్ట్ క్రికెట్‌లో నంబర్ వన్‌గా ఉంది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఆస్ట్రేలియాను, ఇంగ్లాండ్‌ జట్లను వారి దేశాల్లోనే ఓడించింది. విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న జట్టులో కూడా ఉన్నాడు. అయితే అతని కెప్టెన్సీలో జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ను గెలుచుకోలేకపోయింది.

ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ ప్రదర్శన
విరాట్ కోహ్లీ ఐపీఎల్2025లో చాలా పరుగులు చేస్తున్నాడు. ఇప్పటివరకు 14 మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి 602 పరుగులు వచ్చాయి. ఇందులో విరాట్ కోహ్లీ 8 హాఫ్ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ గెలుచుకునే బలమైన పోటీదారుగా కూడా ఉన్నాడు. ఆర్సీబీ ఫైనల్ కు చేరుకుంటే విరాట్ కోహ్లీ కూడా ఆరెంజ్ క్యాప్‌ను పొందవచ్చు. మరోవైపు ఆర్సీబీ మొదటిసారి ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకోగలిగితే విరాట్ టీ20 ఇంటర్నేషనల్ లాగానే ఐపీఎల్ నుంచి కూడా రిటైరయ్యే అవకాశం ఉంది. కానీ అభిమానులు ఇప్పుడు విరాట్ కోహ్లీ రిటైర్ కావాలని ఎప్పటికీ కోరుకోరు. టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌ను అభిమానులు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు.

Story first published: Thursday, May 29, 2025, 14:57 [IST]
Other articles published on May 29, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+