Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: లక్నో-ఆర్సీబీ మ్యాచ్ కూడా రద్దు?

IPL 2025: భారత్, పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత ఐపీఎల్ 2025పై కూడా ప్రభావం చూపింది. గురువారం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ భద్రతను దృష్టిలో ఉంచుకుని అకస్మాత్తుగా రద్దు చేయబడింది. అనంతరం మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఆటగాళ్లను కూడా వెంటనే వారి హోటళ్లకు తిరిగి పంపించారు. ఇది జరిగిన అనంతరం.. అందరి మనస్సులో మెదులుతున్న ప్రశ్న ఏమిటంటే.. ఐపీఎల్‌లో శుక్రవారం లక్నో, ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. పంజాబ్-ఢిల్లీ మ్యాచ్ లాగే రద్దు చేయబడుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపై ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక అప్‌డేట్ ఇచ్చారు.

IPL 2025 Will LSG vs RCB Also Be Cancelled BCCI Closely Monitoring the Situation

ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. "ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నాం. పరిస్థితి వేగంగా మారుతోంది. ప్రతి దానిని నిశితంగా గమనిస్తూ ప్రభుత్వ సూచనల కోసం ఎదురుచూస్తున్నాం. అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోబడుతుంది" అని అరుణ్ ధుమాల్ అన్నారు. శుక్రవారం లక్నోలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ గురించి అడిగినప్పుడు.. ఈ మ్యాచ్ జరుగుతుందని, కానీ ఖచ్చితంగా పరిస్థితి మారుతోందని.. అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోబడుతుందని అరుణ్ ధుమాల్ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నామని.. ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సూచనలు రాలేదన్నారు. ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మా నిర్ణయం ఉంటుందన్నారు. బీసీసీఐ ఏదైనా నిర్ణయం తీసుకునే వరకు లక్నో, బెంగళూరు మధ్య మ్యాచ్ షెడ్యూల్ చేసిన ప్రకారం జరుగుందన్నారు. రెండు జట్లు ప్రస్తుతం లక్నోలో ఉన్నాయి. నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేయబడ్డాయి.

ప్లేఆఫ్ రేసులో ఉన్న ఇరు జట్లు
లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు కూడా రెండూ కూడా ప్లేఆఫ్ రేసులో ఉన్నాయి. వారికి రెండు పాయింట్లు చాలా అవసరం. అయితే లీగ్ కొనసాగింపు క్రికెట్ అవసరాలపై మాత్రమే కాకుండా దేశ ఆందోళనలపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అందరి చూపు బీసీసీఐ, భారత ప్రభుత్వంపైనే ఉంది.

Story first published: Friday, May 9, 2025, 10:22 [IST]
Other articles published on May 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+