Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs RCB: క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ కెప్టెన్ మారుతాడా?

PBKS vs RCB: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ఇరుజట్లు సిద్ధంగా ఉన్నాయి. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టును ఓడించడం ద్వారా ఆర్సీబీ టాప్-2లో నిలిచింది. రజత్ పాటిదార్ గాయపడి ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడుతున్నందున చివరి 2 మ్యాచ్‌లకు ఆర్సీబీ జట్టుకు వికెట్ కీపర్, బ్యాటర్ జితేష్ శర్మ కెప్టెన్సీ వహిస్తున్నాడు.

ఈ క్రమంలో క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ మరోసారి మారవచ్చు. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా ఇరు జట్లు ఫైనల్ బెర్తు కోసం పోరాడనున్నాయి. దీంతో పాటు ఓడిపోయిన జట్టుకు మళ్లీ క్వాలిఫయర్ 2లో ఆడే అవకాశం ఉంటుంది.

IPL 2025 Will Jitesh Sharma Continue as RCB Captain in Qualifier 1 vs PBKS

కెప్టెన్‌గా రజత్ పాటిదార్ తిరిగి రావచ్చు..
వాస్తవానికి ఆర్సీబీ రెగ్యులర్ కెప్టెన్ రజత్ పాటిదార్ ఇటీవల గాయపడ్డాడు. కాబట్టి మ్యాచ్ సమయంలో రజత్ పాటిదార్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడుతున్నాడు. రజత్ పాటిదార్ ఫీల్డింగ్‌కు రావడం లేదు. ప్రస్తుతం జితేష్ శర్మ కెప్టెన్‌గా కనిపిస్తున్నాడు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే.. క్వాలిఫయర్ 1లో కూడా జితేష్ శర్మ ఆర్సీబీకి కెప్టెన్‌గా ఉంటాడా? కానీ ఈ రోజు రజత్ పాటిదార్ పూర్తిగా ఫిట్‌గా ఉంటే అతను మరోసారి ఆర్సీబీకి కెప్టెన్‌గా ఉంటాడు.

అందరి దృష్టి జితేష్ శర్మపైనే..
గత మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై అద్భుతంగా ఆడి జితేష్ శర్మ ఆర్సీబీకి విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో జితేష్ శర్మ కేవలం 33 బంతుల్లోనే 85 పరుగులు చేశాడు. ఇది అతన తొలి అర్ధసెంచరీ కావడంతకో పాటు ఐపీఎల్ కెరీర్ లో అత్యుత్తమ ఇన్నింగ్స్ కూడా. ఈ క్రమంలో జితేష్ శర్మకు మళ్లీ అవకాశం వస్తే అభిమానులు జితేష్ శర్మ నుంచి ఇలాంటి అద్భుత ఇన్నింగ్స్ ను ఆశిస్తారు.

Story first published: Thursday, May 29, 2025, 10:53 [IST]
Other articles published on May 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+