For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: కోహ్లీ వర్సెస్ రోహిత్ - ఐపీఎల్‌లో ఎవరు గొప్ప?

కోహ్లీ - రోహిత్.. ఈ రెండు పేర్లకు ఉండే క్రేజే వేరు. అది ఆఫ్ ఫీల్ అయినా, ఆన్ ఫీల్డ్ అయినా, అంతర్జాతీయ క్రికెట్ అయినా, లీగ్ క్రికెట్ అయినా.. క్రీజుల్లోకి వచ్చారంటే స్టేడియం దద్దరిల్లాల్సిందే. అయితే ఐపీఎల్ 2025 మరో వారం రోజుల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో కోహ్లీ వర్సెస్ రోహిత్ చర్చ మళ్లీ మొదలైంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో వీరిద్దరి గణాంకాలు ఎలా ఉన్నాయి, ఎవరు ముందు వరుసలో ఉన్నారో తెలుసుకుందాం..

ఐపీఎల్ 2025 కోసం సిద్ధంగా..
రీసెంట్ గా ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయంలో కోహ్లీ- రోహిత్ ఇద్దరూ కీలకంగా వ్యవహరించారు. ఒకరు లీగ్, నాకౌట్ స్టేజ్ లో రాణిస్తే.. మరొకరు ఫైనల్ లో అద్భుతంగా ఆడారు. ఇప్పటి వరకు ఒకే జట్టు కోసం పోరాడం చేసిన వీరిద్దరు.. ఇప్పుడు ఐపీఎల్ 2025లో వేరువేరుగా తమ జట్ల కోసం ఆడనున్నారు.

కోహ్లీని ఆర్సీబీ రూ.21 కోట్లకు రిటైన్ చేసుకుంది. గత 17 ఏళ్లుగా విరాట్ టాప్ పెర్ఫారర్ గా కొనసాగుతూనే ఉన్నాడు. అది కూడా ఒకే జట్టు తరఫున ఆడుతున్నాడు. ఇప్పటివరకు ఆరెంజ్ క్యాప్ ను రెండు సార్లు గెలుచున్నారు. మరోవైపు రోహిత్ ను ముంబయి రూ.16.30 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఆర్సీబీకి కోహ్లీ ఎలానో, ముంబయికి రోహిత్ అలానే. వీరిద్దరి వల్లే తమ జట్లకు ఫుల్ క్రేజ్ వచ్చింది.

ఎక్కువ పరుగులు ఎవరంటే?
కోహ్లీ ఇప్పటివరకు ఐపీఎల్ లో252 మ్యాచులు ఆడగా..రోహిత్ 257 మ్యాచులు ఆడాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరివి 252 మ్యాచుల గణాంకాలను పరిశీలిద్దాం.
కోహ్లీ 252 మ్యాచులు ఆడి.. 244 ఇన్నింగ్స్ లో 8004 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 252 మ్యాచుల్లో 247 ఇన్నింగ్స్ ఆడి 6522 రన్స్ సాధించాడు. అంటే రోహిత్ కన్నా కోహ్లీనే ఎక్కువ పరుగులు చేశాడు.

యావరేజ్ అండ్ స్ట్రైక్ రేట్
విరాట్ కోహ్లీకి 252 మ్యాచుల్లో 38.66 యావరేజ్, 131.97 స్ట్రైక్ రేట్ ఉంది. అదే రోహిత్ శర్మకు 252 మ్యాచుల్లో 30.61 యావరేజ్ తో పాటు 131.22 స్ట్రైక్ రేట్ ఉంది. అంటే స్టైక్‌రేట్ విషయంలో కోహ్లీ, రోహిత్ దగ్గరగానే ఉన్నారు.

ఎక్కువ శతకాలు ఎవరంటే
252 మ్యాచుల్లో కోహ్లీ 55 అర్ధ శతకాలు, 8 సెంచరీలు బాదాడు. అందులో అత్యధిక వ్యక్తిగత స్కోరు 113*. 2024లో రాజస్థాన్ పై దీన్ని చేశాడు.252 మ్యాచుల్లో రోహిత్ శర్మ 42 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు బాదాడు. అందులో అత్యధిక వ్యక్తిగత స్కోరు 109*. దీన్ని కోల్ కతా నైట్ రైడర్స్ పై సాధించాడు. అంటే ఈ లెక్కన రోహిత్ కన్నా కోహ్లీనే ఎక్కువ శతకాలు, అర్ధ శతకాలు చేశాడు.

IPL 2025 Who is great Virat Kohli vs Rohit Sharma comparing ipl stats
Photo Credit: twitter screenshot

అదొక్కటి తప్ప అన్నింటిలోనూ కోహ్లీనే..
మొత్తంగా అన్నింటిలోనూ రోహిత్ కన్నా కోహ్లీనే ఎక్కువగా ఉన్నాడు. కాకపోతే కెప్టెన్ గా మాత్రం రోహిత్ ఐదు సార్లు జట్టుకు ట్రోఫీని అందించాడు. 2009లోనూ డెక్కన్ ఛార్జర్స్ విజయంలోనూ భాగమయ్యాడు. కానీ కోహ్లీ సారథిగా ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడలేకపోయాడు.

Story first published: Friday, March 14, 2025, 19:00 [IST]
Other articles published on Mar 14, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+