CSK : ఇప్పుడితడే సీఎస్కేకు ప్రాణం..!
Who is Ayush Mhatre?: ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. ప్రస్తుతం ఐపీఎల్ 2025లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచుల్లో కేవలం ఒక్క మ్యాచులో గెలిచి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. అయితే గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తప్పుకోవడంతో ధోనీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయినా ఆ జట్టు రాత మారలేదు. ఈ నేపథ్యంలో గైక్వాడ్ బ్యాటింగ్ కు దిగే మూడో స్థానంలో ముంబై ప్లేయర్ ఆయుశ్ మాత్రేతో భర్తి చేసేందుకు సిద్ధమైంది జట్టు యాజమాన్యం. దీంతో ఇప్పుడంతా అతడి గురించి ఆరా తీయడం ప్రారంభించాడు సీఎస్కే అభిమానులు. అతడి గణాంకాలు ఏంటి? ఇంతకుముందు అతడు ఎలాంటి ప్రదర్శన చేశాడు? వంటి విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
అప్పుడు ఎవరూ కొనలే...
మాత్రేను.. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు సీఎస్కే రూ.30 లక్షల బేస్ ప్రైస్ కు తీసుకున్నట్లు తెలిసింది. వాస్తవానికి గతేడాదే మాత్రేను ట్రయల్స్‌కు పిలిపించుకుంది సీఎస్కే. కానీ ఆక్షన్ లో కొనుగోలు చేయలేదు. మళ్లీ ఇప్పుడు అతడిపై ఆసక్తి కనబరిచి తీసుకుంది.

మాత్రే కెరీర్ రికార్డులు..
మాత్రే వయసు 17 ఏళ్లు. 2007లో జులై 16న జన్మించాడు. ఇతడు కుడి చేతి వాటం ఓపెనింగ్ బ్యాటర్. అకేషనల్ ఆఫ్ స్పిన్నర్ కూడా. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2024 అక్టోబరులో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ముంబయి జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. కెరీర్ లో 9 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 31.50 సగటుతో 504 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ ఉంది. అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 176. 7 లిస్ట్ A మ్యాచుల్లో 65.42 సగటు, 135 స్ట్రైక్ రేటుతో 458 పరుగులు సాధించాడు. ఇందులో 2 శతకాలు, 1 అర్ధ శతకం ఉంది. లిస్ట్-A మ్యాచుల్లో బౌలింగ్ లో 7 వికెట్లు కూడా పడగొట్టాడు. చూడాలి మరి ఈ కుర్రాడు.. రుతురాజ్ కు సరైన రీప్లేసేనా? కాదా అనేది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications