KKR VS PBKS: ఐపీఎల్ 2025 ఈడెన్ గార్డెన్స్ వేదకగా జరిగిన కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ వర్షం కారణంగా రద్దైంది. మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి కోల్‌కతా జట్టు.. బ్యాటింగ్ ప్రారంభించిన సేపటికే వర్షం మొదలైంది. 7 పరుగుల సమయానికి వర్షం ఏకధాటిగా పడుతూ మ్యాచను ముందుకు వెళ్లనివ్వలేదు. మధ్యలో కాసేపు వర్షం తగ్గినట్టే తగ్గి మళ్లీ ప్రారంభమైంది. అంతకంతకూ వాన పెరగడంతో చివరికి ఈ మ్యాచ్ రద్దైంది. మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. మ్యాచ్ రద్ద కావడం వల్ల పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.

ఈ మ్యాచులో మొదటగా టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే కేకేఆర్ బౌలర్లకు పంజాబ్ ఓపెనర్లు చెమటలు పట్టించారు. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (35 బంతుల్లో 197 స్ట్రైక్ రేటు, 8 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 69 పరుగులు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (49 బంతుల్లో 169 స్ట్రైక్ రేటు, 6 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 83 రన్స్) మంచి ఆరంభం ఇచ్చారు అందించారు. వరుసగా బౌండరీలు, సిక్సులు బాదారు. ఇద్దరు కలిసి తొలి వికెట్ కు 120 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అయితే వీరిద్దరిని ఆండ్రూ రస్సెల్ విడగొట్టాడు. ప్రియాంశ్ ఆర్యను పెవిలియన్ పంపాడు. అలానే సెంచరీకు దగ్గరగా వచ్చిన ప్రభ్‌సిమ్రన్‌ను వైభవ్ అరోరా ఔట్ చేశాడు. ఆ తర్వాత గ్లెన్ మ్యాక్స్ వెల్ (7) నిరాశపరిచాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (25 నాటౌట్), మార్కో జాన్సన్ (3), జోస్ ఇంగ్లీష్ (11) పరుగులు చేశారు.కేకేఆర్ డెత్ ఓవర్లు బాగా వేసింది. లాస్ట్ రెండు ఓవర్లు యండ్రూ రసెల్ మంచిగా వేశాడు. తక్కువ పరుగులే ఇచ్చాడు. వైభవ్ అరోరా 2 వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి, యాండ్రూ రసెల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
ఏ జట్టుకు లాభం, నష్టం?
ఈ మ్యాచ్ రద్దు అవ్వడం వల్ల కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్లకు చెరో పోయింట్ వచ్చింది. దీంతో ఇప్పుడు మొత్తంగా పంజాబ్ ఖాతాలో 11 పాయింట్లు వచ్చాయి. పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. కేకేఆర్ ఖాతాలో ఏడు పాయింట్లు వచ్చాయి. టేబుల్ లో ఏడో స్థానంలో నిలిచింది. అయితే ఈ మ్యాచ్ రద్దు వల్ల కేకేఆర్ ఓటమి భయం లేకుండా పోయింది. ఫలితంతో సంబంధం లేకుండా ఓ పాయింట్ వచ్చి చేరడంతో కాస్త కలిసొచ్చింది. విజయం సాధించి టోర్నీలో ముందుకెళ్ధామనుకున్న పంజాబ్ జట్టుకు ఇది కాస్త బాధాకరమైన విషయం. ఒకవేళ ఈ మ్యాచ్ జరిగి గెలిచి ఉంటే మరో పాయింట్ ఎక్కువ సాధించి మరో అడుగు ముందుకేసేది.